Beauty Tips

Hair Growth Tips:జుట్టు రాలే సమస్యను శాశ్వతంగా వదిలించుకోండి.. ఈ చిట్కాలు ఫాలో అవండి..

Hair Problem tips in telugu :ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రారంభంలోనే తగ్గించుకొనే ప్రయత్నం చేయాలి. జుట్టుకి సంబందించిన సమస్యలను తగ్గించుకోవటానికి ఇంటి చిట్కాలు చాలా చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.

ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి పరిస్థితి కారణంగా జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువగా కనపడుతుంది. ఈ సమస్య రాగానే మనలో చాలా మంది కంగారూ పడి మార్కెట్ లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెడుతూ ఉంటారు. అలా కాకుండా చాలా తక్కువ ఖర్చుతో ఇంటి చిట్కాలను ఫాలో అవ్వవచ్చు.

ఒక చిన్న ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేయాలి. ఆ తర్వాత గుప్పెడు కరివేపాకు వేయాలి. రెండు అంగుళాల కలబంద ముక్కను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని ఒక బౌల్ లోకి తీసుకొని దానిలో ఒక Vitamin E capsule లోని ఆయిల్ ని వేయాలి.

అన్ని ఇంగ్రిడియన్స్ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి అరగంట అలా వదిలేయాలి. ఆ తర్వాత కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు లేదా మూడు సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య మరియు చుండ్రు సమస్య తగ్గుతుంది.

కలబంద గుజ్జులో ప్రొటీలిటిక్ ఎంజైమ్ కలిగి ఉంటుంది. ఇది తలపై దెబ్బతిన్న కణాలను నయం చేయడానికి సహాయపడుతుంది. ఇది జుట్టు యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా పరోక్షంగా ఆరోగ్యకరమైన మరియు వేగవంతమైన జుట్టు పెరుగుదలను పెంచుతుంది. జుట్టు రాలకుండా జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.

జుట్టు పెరుగుదలకు అవసరమైన సల్ఫర్, కేరాటిన్ అనేవి ఉల్లిపాయలో సమృద్దిగా ఉంటాయి. ఊడిపోయిన జుట్టుని తిరిగి పెరగడానికి అద్భుతంగా పనిచేస్తుంది. తెల్లజుట్టును నల్లగా మార్చటంలో కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే యాంటీ బ్యాక్టిరియల్ లక్షణాలు ఉండుట వలన చుండ్రు సమస్యను తగ్గిస్తుంది.

ఈ చిట్కాలో ఉపయోగించిన ఉల్లిపాయ,కరివేపాకు, కలబంద. విటమిన్ E oil లో ఉన్న పోషకాలు చుండ్రు జూతు రాలే సమస్యను తగ్గించటమే కాకుండా జుట్టు కుదుళ్ళు బలంగా మారేలా చేసి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగటానికి సహాయపడతాయి.

జుట్టు సమస్యలు వచ్చినప్పుడు అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మార్కెట్ లో దొరికే ఉత్పత్తులను వాడితే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి. ఈ చిట్కాను ఫాలో అవ్వటం కూడా సులువే.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News