White Hair Turn Black:20 ఏళ్లు దాటకుండానే జుట్టు తెల్లబడిపోయిందా.. ఐతే ఇలా చేసి చూడండి!
White Hair Turn Black :తెల్లజుట్టు సమస్య వచ్చినప్పుడు అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. ఇంటి చిట్కాలతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. తెల్లజుట్టు తక్కువగా ఉంటే తక్కువ వారాల సమయం, తెల్లజుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాల సమయం పడుతుంది. ఇప్పుడు చెప్పే ఈ నూనె చాలా అద్భుతంగా పనిచేస్తుంది. జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.
ఈ మధ్య కాలంలో మారిన పరిస్థితి కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. సమస్యలను చూసి కంగారు పడకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బయట పడవచ్చు.
ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య అనేది వస్తుంది. దాంతో కంగారుపడి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. అయినా పెద్దగా ఫలితం ఉండక చాలా నిరాశకు గురి అవుతూ ఉంటారు. వాతావరణంలో కాలుష్యం, కెమికల్స్ ఎక్కువగా ఉన్న ప్రొడక్ట్స్ వాడటం వంటి కారణాలతో తెల్ల జుట్టు సమస్య వస్తుంది.
మెలనిన్ ఉత్పత్తి తగ్గినప్పుడు జుట్టు తెల్లగా మారటం ప్రారంభం అవుతుంది. ఈ సమస్య వచ్చినప్పుడు అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. మన ఇంటిలో ఉన్న కొన్ని వస్తువులతో చాలా సులభంగా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. అలాగే తెల్ల జుట్టు రాకుండా కూడా నివారించవచ్చు. ఇప్పుడు చెప్పే నూనెను వారంలో రెండు సార్లు జుట్టుకి రాస్తే సరిపోతుంది.
ఇలా చేయటం వలన మెలనిన్ ఉత్పత్తి పెరిగి తెల్లజుట్టు రాకుండా ఉంటుంది. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక కప్పు కొబ్బరి నూనె, ఒక స్పూన్ ఉసిరి పొడి, ఒక స్పూన్ టీ పొడి, ఒక స్పూన్ శీకాయ పొడి, ఒక స్పూన్ కలోంజి సీడ్స్ పొడి వేసి పది నిముషాలు మరిగించి పొయ్యి ఆఫ్ చేసి… చల్లారక పల్చటి వస్త్రం సహాయంతో వడకట్టాలి.
ఈ నూనెను ఒక సీసాలో పోసి నిల్వ చేసుకోవాలి. ఈ నూనె దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ నూనెను రాత్రి పడుకొనే ముందు జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి.. మరుసటి రోజు ఉదయం కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే సరిపోతుంది.
ఈ విధంగా చేయటం వలన మెలనిన్ ఉత్పత్తి అద్భుతంగా పెరుగుతుంది.దాంతో జుట్టు త్వరగా తెల్ల బడకుండా ఉంటుంది. అంతేకాకుండా జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. ఈ నూనెలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు జుట్టుకి పోషణ అందిస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u