Soaked Walnuts:పరగడుపున 2 వాల్ నట్స్ నానబెట్టి తింటే…ముఖ్యంగా ఈ సీజన్ లో…ఎందుకంటే….
Soaked Walnuts Health Benefits in telugu : ఈ మధ్యకాలంలో వాల్ నట్స్ తినడం అలవాటు చేసుకుంటున్నారు. వాల్ నట్స్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలుసుకుని అందరూ తింటున్నారు. అయితే కొంతమంది వాల్ నట్స్ టేస్ట్ నచ్చక తినడం మానేస్తున్నారు. వాల్ నట్స్ లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే తినని వారు కూడా తినడం అలవాటు చేసుకుంటారు.
రోజుకి మూడు నుంచి నాలుగు వాల్ నట్స్ తినమని డాక్టర్స్ సిఫార్సు చేస్తున్నారు. ఏ వయసు వారైనా వాల్ నట్స్ తినవచ్చు. అయితే వాల్ నట్స్ అలా తినకుండా నానబెట్టి తింటే వాల్ నట్స్ లో ఉన్న వంద శాతం పోషకాలు మన శరీరానికి అందుతాయి. వాల్ నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండటం వలన గుండె సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
వాల్ నట్స్ లో ఉండే విటమిన్స్, ప్రోటీన్స్, ఫైబర్ కడుపు నిండిన భావన ను ఎక్కువసేపు ఉంచుతాయి. అందువలన బరువు తగ్గాలనుకునే వారికి వాల్ నట్స్ మంచి ఎంపిక అని చెప్పవచ్చు. రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారు కూడా తీసుకోవచ్చు. అంతేకాకుండా డిప్రెషన్, అల్జీమర్స్, ఒత్తిడి వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.
వాల్ నట్స్ లో ఉండే మెలటోనిన్ ఉండుట వలన మంచి నిద్ర పడుతుంది. దాంతో నిద్రలేమి సమస్యలు తొలగిపోతాయి.నానబెట్టిన వాల్ నట్స్ తినటం వలన రక్తంలో చెడు కొలెస్టరాల్ ని తొలగించి మంచి కొలస్ట్రాల్ ని పెంచుతుంది. కాబట్టి మీరు కూడా సాధ్యమైనంత వరకూ వాల్ నట్స్ తీసుకోవటానికి ప్రయత్నం చేయండి. వాల్ నట్స్ అన్ని సూపర్ మార్కెట్ లోనూ సులభంగా అందుబాటులో ఉంటున్నాయి.
వాల్ నట్స్ మెదడు కణాలను ఉత్తేజ పరచటానికి సహాయపడే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మతి మరుపు తగ్గడానికి ఇవి ఎంతగానో సహకరిస్తాయి. వాల్ నట్స్ అల్జీమర్స్ వ్యాధికి సంబంధించిన లక్షణాల్ని తగ్గించగలవని ఇటీవల జరిగిన పరిశోదనల్లో తేలింది. వాల్ నట్స్ లో ఉండే పాలీఫెనోల్స్ కాలేయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
వాల్ నట్స్ ని నీటిలో లేదా పాలల్లో 5 గంటల పాటు నానబెట్టి తినాలి. పచ్చి వాల్ నట్స్ తింటే దానిలోని పోషకాలు 60 శాతం మాత్రమే అందుతాయి. అదే నానబెట్టిన వాల్ నట్స్ తింటే వంద శాతం పోషకాలు మన శరీరానికి అందుతాయి. అలాగే నానబెట్టిన వాల్ నట్స్ తింటే వయస్సు పెరిగిన వారికీ జిర్నమ అవ్వటానికి బాగుంటుంది. కాబట్టి రోజులో 2 walnuts తింటే సరిపోతుంది. ఏదైనా తగిన మోతాదులో తీసుకుంటేనే వాటిలోని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే walnuts తినటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u