Hair Care Tips:ఉల్లి రసంలో ఈ పొడిని కలిపి రాస్తే 7 రోజుల్లో జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది
Onion and fenugreek seeds Hair Loss Tips in telugu : మనలో చాలామంది జుట్టు పల్చగా ఉందని బాధపడుతూ ఉంటారు. దాంతో మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. ఇలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించవచ్చు.
జుట్టు రాలే సమస్య, చుండ్రు వంటి జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను చాలా సులభంగా చాలా తక్కువ ఖర్చులో తగ్గించుకోవచ్చు. మెంతులను పొడిగా తయారు చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఆ తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేయాలి.
ఆ తర్వాత అర చెక్క నిమ్మరసం పిండి మిక్సీ చేయాలి. నీటిని ఉపయోగించకూడదు. ఇలా తయారైన పేస్ట్ ని గిన్నె లోకి వడకట్టుకోవాలి. ఇలా వచ్చిన జ్యూస్ లో రెండు స్పూన్ల మెంతులు పొడి వేసి బాగా కలిపి గంట సేపు అలా వదిలేయాలి. ఇలా చేయడం వలన మెంతులలో ఉన్న పోషకాలు ఉల్లిరసంలో బాగా కలుస్తాయి.
ఆ తర్వాత ఒక స్పూన్ బాదం నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించాలి. గంట తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం చాలా తొందరగా వస్తుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
మెంతులలో ఉండే లక్షణాలు జుట్టు రాలే సమస్యను తగ్గించటమే కాకుండా కండిషనర్ గా పనిచేస్తుంది. ఉల్లిపాయలో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్లను బలంగా చేస్తాయి. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి చుండ్రు సమస్యను తగ్గిస్తుంది. బాదం నూనెలో ఉండే విటమిన్ E జుట్టును బలంగా చేస్తుంది.
మెంతి పొడి, ఉల్లిపాయ, నిమ్మరసం, బాదం నూనెలను ఈ చిట్కాలో ఉపయోగించాము. వీటిలో ఉన్న పోషకాలు చుండ్రు,జుట్టు రాలే సమస్యను తగ్గించటమే కాకుండా జుట్టు కుదుళ్ళకు అవసరమైన పోషణను అందించి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తాయి.
జుట్టు రాలే సమస్య వచ్చినప్పుడు మార్కెట్ లో దొరికే ఉత్పత్తులను అసలు వాడవలసిన అవసరం లేదు. మన ఇంటిలో దొరికే సహజసిద్దమైన పదార్ధాలను ఉపయోగించి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టుకి సంబంధించి అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కాస్త ఓపికగా ఈ చిట్కాలను ఫాలో అవ్వాలి. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x