Winter care Tips:ముఖం జిడ్డుగా మారుతుందా…బెస్ట్ ఫాక్స్
Winter care Tips:ముఖం జిడ్డుగా మారుతుందా…బెస్ట్ ఫాక్స్.. జిడ్డు చర్మంతో బాధపడుతున్నారా? డోన్ట్ వర్రీ.. ఇంటి వద్ద మీరు సులభంగా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. కొందరి ముఖం త్వరగా జిడ్డుగా మారుతుంది. స్నానం చేసినా, ముఖం కడుకున్న కొద్ది క్షణాల్లో జిడ్డుగారుతూ కనిపిస్తుంది. అయితే, ఈ సమస్యను ఇంట్లోనే పరిష్కరించుకోవచ్చు. జిడ్డును దూరం చేసే ఆ చిట్కాలను చూసేద్దామా!
కొన్ని నల్ల ద్రాక్ష పళ్ళను తీసుకోని మెత్తగా గ్రైండ్ చేసుకొని దానికి రెండు స్పూన్ల ముల్టాన మట్టిని కలపాలి. ఆ తర్వాత దానిలో కొద్దిగా రోజ్ వాటర్,మూడు చుక్కల నిమ్మరసం వేసి మెత్తని పేస్ట్ గా తయారుచేయాలి. ఆ తర్వాత ఈ పేస్ట్ ని ముఖానికి,మెడకు బాగా పట్టించాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని,మెడను కడిగి మాయీ శ్చరైజర్ రాసుకోవాలి.
నల్ల ద్రాక్ష గుజ్జుకి ఒక స్పూన్ పుదినా పేస్ట్,ఒక స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ లో కొంచెం రోజ్ వాటర్ వేసి దానిలో ఒక ఐస్ క్యూబ్ వేసి, ఫేస్ ప్యాక్ తీసిన వెంటనే ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే,ముఖంపై అధికంగా ఉన్న జిడ్డు తొలగిపోతుంది.
రెండు స్పూన్ల నల్ల ద్రాక్ష గుజ్జుకు ఒక స్పూన్ బొప్పాయి గుజ్జు,ఒక స్పూన్ తేనే కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రంగా కడగాలి. ద్రాక్షలో ఉండే సహజ ఆమ్లాలు,విటమిన్స్ చర్మానికి కొత్త కాంతిని అందిస్తాయి.
ఒక బౌల్ లో అరస్పూన్ పసుపు వేసి సరిపడా పాలను పోసి బాగా కలిసేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు పట్టించి 5 నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే క్రమంగా ముఖం మీద జిడ్డు తొలగిపోతుంది. పసుపులో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు జిడ్డు తత్వాన్ని దూరం చేస్తాయి.
జిడ్డు చర్మం సమస్య ఉన్న వారికీ టమోటా చాలా బాగా సహాయపడుతుంది. టమోటా ముక్కను తీసుకోని ముఖం మీద రబ్ చేసి 5 నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
స్నానానికి పదిహేను నిమిషాల ముందు యాపిల్‌ను పలుచని స్లైసుల్లా కోసి ముఖంపై ఉంచాలి. యాపిల్ స్లైసులు చర్మంలోని అధిక నూనెను పీల్చుకొని ఫలితంగా ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u