Dubbing Artists:తెలుగు లో టాప్ 10 డబ్బింగ్ ఆర్టిస్ట్స్ వీళ్ళే…!
Tollywood Dubbing Artists In telugu:ఒకప్పుడు అందం,అభినయం,వాచకం అన్నీ ఉంటేనే సినిమా ఫీల్డ్ లో నిలదొక్కుకునే ఛాన్స్ ఉండేది. అయితే రాను రాను వేరే భాషల వాళ్ళు యాక్ట్ చేయడం వలన వారికి డబ్బింగ్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చేసింది. దీంతో డబ్బింగ్ కళాకారులకు మంచి గిరాకే ఏర్పడింది. యాక్టర్స్ కి వాయిస్ చెప్పడం ద్వారా డబ్బింగ్ కళాకారులు జీవం పోస్తున్నారు.
నటుడిగా రాణిస్తూనే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సాయికుమార్ తన అసాధారణమైం డైలాగ్ డెలివరీతో ఎందరికో వాయిస్ ఇచ్చారు. సుమన్,డాక్టర్ రాజశేఖర్ తదితరులకు ఈయన చెప్పిన డబ్బింగ్ వల్లనే వాళ్ళకి క్రేజ్ వచ్చిందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అమితాబ్ కి కూడా డబ్బింగ్ చెప్పారు. సాయికుమార్ బ్రదర్ రవి శంకర్ అయితే సోనూ సూద్,ప్రకాష్ రాజ్,ఆశిష్ విద్యార్థి ,నాజర్ ఇలా చాలామందికి డబ్బింగ్ చెప్పారు. అరుంధతిలో ఆయన డైలాగ్స్ ఓ క్రేజ్ తెచ్చాయి. ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా అవార్డులు అందుకున్నారు.
టాలీవుడ్ నెంబర్ వన్ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం సౌత్ ఇండియా సూపర్ స్టార్ కమల్ హాసన్ కి డబ్బింగ్ చెబుతారు. దశావతారం మూవీలో పది పాత్రలకు గాను 7పాత్రలకు డబ్బింగ్ చెప్పి ఔరా అనిపించారు. సుమన్ కి డబ్బింగ్ చెప్పడం ద్వారా బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్టుగా నంది పురస్కారాన్ని అన్నమయ్య మూవీకి అందుకున్నారు. అలాగే టాలీవుడ్ గాయకుల్లో మనో ఒకరు.
సూపర్ స్టార్ రజనీకాంత్ కి డబ్బింగ్ చెప్పే మనో,సరైన సమయంలో సరిగ్గా పంచ్ డైలాగ్ లతో చెప్పి మెప్పిస్తాడు. అలాగే కమల్ హాసన్ కి కూడా ఆయనే డబ్బింగ్ చెబుతారు. ప్రముఖ గాయని ఎస్పీ శైలజ కూడా మురారి మూవీలో సోనాలి బింద్రేకి,నిన్నే పెళ్లాడతా మూవీలో టబుకి డబ్బింగ్ చెప్పారు. సంఘవి,శ్రీదివి తదితరులకు కూడా డబ్బింగ్ చెప్పారు. సింగర్ హేమచంద్ర అయితే దృవ మూవీలో నెగెటివ్ రోల్ అరవింద్ గోస్వామికి కూడా డబ్బింగ్ చెప్పాడు. అబ్బాస్ ,దీపక్ ,అరవింద్ స్వామి, వినీత్ తదితరులకు గాయకుడు రఘు కుంచె డబ్బింగ్ చెప్పాడు.
ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ సవితా రెడ్డి తెలుగులో ఆర్తి అగర్వాల్,భూమిక,త్రిష ఇలా చాలామందికి వాయిస్ ఇచ్చారు. ముఖ్యంగా ఖుషి మూవీలో భూమికకు చెప్పిన డబ్బింగ్ మంచి పేరుతెచ్చిపెట్టింది. నువ్వు నాకు నచ్చావ్,బొమ్మరిల్లు మూవీస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డులు గెలుచుకున్నారు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఎదుగుతున్న గాయని చిన్మయి శ్రీపాద అయితే అక్కినేని సమంతకు అన్ని మూవీస్ కి డబ్బింగ్ చెప్పింది.
ఏం మాయ చేసావే మూవీకి నంది అవార్డు అందుకుంది. తెలుగులోనే కాదు,తమిళ,కన్నడంలో చాలామంది హీరోయిన్స్ కి ఆమె డబ్బింగ్ చెప్పారు. సదా, త్రిష, తమన్నా,కమిలిని ముఖర్జీ,అనుష్క,మీరా జాస్మిన్, శ్రేయ,స్నేహ ఇలా చాలామందికి ప్రముఖ గాయని సునీత డబ్బింగ్ చెప్పారు. జయం,పోతేపోనీ వంటి మూవీస్ కి ఉత్తమ డబ్బింగ్ అవార్డులు అందుకుంది.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u