Beauty TipsHealth

Skin Allergy:ఆర్టిఫిషియల్ ఆభరణాలతో స్కిన్ అలర్జీ వస్తోందా.. ఇలా చెక్​ పెట్టండి

Allergy from artificial jewelry: ఆర్టిఫిషియల్ ఆభరణాలతో స్కిన్ అలర్జీ వస్తోందా.. ఇలా చెక్​ పెట్టండి..బంగారం ధరలు పెరిగిపోతూ ఉండటం వలన మనలో చాలా మంది ఆర్టిఫిషియల్ నగలను ఉపయోగిస్తున్నారు. వాటిని ఉపయోగించినప్పుడు కొంత మందికి అలర్జీ వస్తుంది.

అలా అలర్జీ రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలా జాగ్రత్తలు తీసుకుంటే చాలా హ్యాపీగా ఆర్టిఫిషియల్ నగలను వేసుకోవచ్చు. కొంతమంది చర్మతత్వాలకు ఆర్టిఫిషియల్‌ నగలు సెట్ కావు. దానితో అలెర్జీ కారణంగా చర్మంపై ఎర్రటి దద్దుర్లు, దురద, మంట.. వంటి సమస్యలు వస్తాయి.

ఆర్టిఫిషియల్‌ నగలను వేసుకోవటానికి ముందు పౌడర్‌, మాయిశ్చరైజర్‌, క్యాలమైన్ లోషన్స్‌ వంటివి రాసుకుంటే.. అవి చర్మాన్ని రక్షిస్తాయి.

నగలను ధరించటానికి ముందు వాటిపై ట్రాన్స్‌పరెంట్‌ నెయిల్‌ పాలిష్‌ ని ఒక కోటింగ్ వేస్తే మెటల్‌ ప్రభావం చర్మంపై పడదు.

ఆర్టిఫిషియల్‌ నగల అలెర్టీ ఉన్నవారు టైట్‌గా ఉండే జ్యూయలరీకి దూరంగా ఉండాలి. ఎందుకంటే నగలు టైట్‌గా ఉండుట వలన గాలి సరిగా లేక అలర్జీ వస్తుంది.

నగల వల్ల చర్మంపై దురదగా అనిపిస్తే.. ఆ ప్రదేశంలో కలబంద గుజ్జును రాస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది. కలబందలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సమస్యను తగ్గించటానికి సహాయపడతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ