Devotional

Gold Jewelry:స్త్రీలు కాళ్ళకు బంగారు పట్టీలు ఎందుకు పెట్టుకోరో తెలుసా ?

why not put gold straps on the legs : ప్రాచీనకాలం నుంచి స్త్రీ పురుషులు ఎక్కువగా బంగారు, వెండి ఆభరణాలను ధరించేవారు. నేటికీ ఆభరణాలకు డిమాండ్ అలాగే ఉంది. ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు. ఏ స్త్రీ అయినా బంగారు ఆభరణాలు ధరిస్తే వారి అందం రెట్టింపు పెరుగుతుంది. ఈ కారణంగా చాలా మంది మహిళలు ప్రతిరోజూ బంగారు ఆభరణాలను ధరించడానికి ఇష్టపడతారు.

నేటికీ దాదాపు ప్రతి ఒక్క స్త్రీ చెవులకు బంగారు చెవిపోగులు, మెడలో బంగారు ఆభరణాలు ధరించడమే కాకుండా చేతులకు బంగారు కంకణాలు, ఉంగరాలు ధరించి అందాన్ని పెంచుకుంటారు. కానీ చీలమండలు, కాలి మెట్టెల విషయానికి వస్తే, మహిళల మొదటి ఎంపిక వెండి. స్త్రీలు బంగారు ఆభరణాలు ధరించినప్పటికీ, వారు వెండితో చేసిన పట్టీలు మాత్రమే ధరిస్తారు. దీని వెనుక మతపరమైన, శాస్త్రీయ కారణాలు ఉన్నాయి.

మన ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు అన్నీ శాస్త్రీయత జోడించి పెట్టినవే. శాస్త్రీయత గురించి సక్రమంగా వివరించకపోవడం, కొన్ని మూఢ నమ్మకాలుగా చెలామణి అవ్వడం వలన ఏదో చాదస్తం అనుకుంటామే గానీ, చాలావరకూ శాస్త్రీయత జోడించి ఉంటాయి. అలాగే బంగారు పట్టీలు కాళ్లకు పెట్టుకోకూడదని అంటారు.

ఎందుకంటే బంగారం అంటే సాక్షాత్తూ లక్ష్మీదేవి గా భావిస్తారు. అందుకే కాలికి పెట్టకూడదని అంటారు. అయినా వెండి పట్టీలు పెట్టుకోవడం వలన మనలోని పాదాల నుంచి పైకి పాకే వేడిని అడ్డుకుంటుందని అంటారు. పాదాలు వెండి పట్టీల వలన చల్లగా ఉంటె, మొత్తం శరీరం వేడిలేకుండా ఉంటుందని చెబుతారు.

ఇలా ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్య పరంగా కూడా వెండి పట్టీలు మంచివని పండితులు చెబుతారు. అందుకే ఈ ఆధునిక ఫాషన్ యుగంలో సైతం రకరకాల బంగారు నగలు ధరిస్తున్నా సరే, కాలికి మాత్రం పెట్టుకోరు.

అంతెందుకు మహానటి సావిత్రి ఇంట్లోనే బంగారు నగలు తయారుచేసే కార్కానా ఉండేదని సినిమాలో కూడా చూపించారు. అయితే ఈమె బంగారు పట్టీలు పెట్టుకోవడం వలన ఒక్కసారిగా పతనమైందని కొంతమంది చెప్పేమాట.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ