Healthhealth tips in telugu

Healthy Foods:శరీరంలో నీరసం,అలసటను తగ్గించి బలాన్ని పెంచే ఆహారాలు… డ్రై ఫ్రూట్స్ ని మించి

Best Healthy Foods :శరీరంలో నీరసం,అలసటను తగ్గించి బలాన్ని పెంచే ఆహారాలు… డ్రై ఫ్రూట్స్ ని మించి ఖరీదైన డ్రై ఫ్రూట్స్ తినాలంటే అందరికీ సులభం కాదు. చాలా తక్కువ ఖర్చుతో ఎన్నో పోషకాలను ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఆహారాలను తెలుసుకుందాం. వీటిని తీసుకుంటే ఖరీదైన డ్రై ఫ్రూట్స్ తింటే వచ్చే ప్రయోజనాలు అన్ని అందుతాయి. ఇవన్నీ మనకు అందుబాటులోనే ఉంటాయి.
peanuts side effects
వేరుశనగ గింజలు
గుప్పెడు వేరుశెనగలలో గుడ్డులో ఉన్నంత ప్రోటీన్‌ ఉంటుంది. అదే సమయంలో 100 గ్రాముల పచ్చి వేరుశెనగలో ఒక లీటరు పాలకు సమానమైన ప్రోటీన్ ఉంటుంది. వేరుశనగ గింజలను నానబెట్టి తినవచ్చు. లేదా ఉడికించుకొని తినవచ్చు. శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది. అలాగే రక్తహీనత సమస్య తొలగిపోతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

పచ్చి కొబ్బరి
పచ్చికొబ్బరిని ఎక్కువగా వంటలలో ఉపయోగిస్తారు. పచ్చి కొబ్బరిలో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణ ప్రక్రియ బాగా సాగి మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోతాయి. కొబ్బరిలో మోనోలారిన్‌, లారిక్‌ యాసిడ్‌లు ఉంటాయి కనుక అది యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. రోగనిరోదక శక్తిని పెంచుతుంది.
Health Benefits of Dates
ఖర్జూరం
ఖర్జూరంలో ఉన్న లక్షణాలు నీరసం,అలసట,నిసత్తువ వంటి వాటిని తగ్గించి తక్షణ శక్తిని అందిస్తాయి. శరీరంలో రోగనిరోదక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఎముకలను బలంగా చేస్తుంది. ఐరన్ లోపంతో బాధపడే వారు వీటిని ఎక్కువగా తీసుకోవాలి. ఖర్జూరంలో ఉండే విటమిన్ సి, డిలు స్కిన్ ఎలాసిటిని పెంచుతాయి. దాంతో చర్మం స్మూత్ గా మారుతుంది. చర్మ సమస్యలను నివారిస్తుంది.

నువ్వులు
నువ్వులు కీళ్లనొప్పులు, మోకాళ్ళ నొప్పులను తగ్గించటంలో సహాయపడతాయి. నువ్వులు ఫైబర్‌ను కలిగి ఉంటాయి. వీటినే లిగ్నిన్స్ అంటారు. ఈ రకమైన ఫైబర్స్ శరీరాల్లో ఏర్పడే చెడు కొవ్వును పూర్తిగా తొలగిస్తుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారు, నీరసంతో బలహీనంగా ఉండేవారు నువ్వులు, బెల్లం కలిపి ఉండలు చేసుకుని తింటే మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ