Healthhealth tips in telugu

Soaked Chana Water:నానబెట్టిన శనగల నీటిని ఉదయాన్నే పరగడుపున తాగితే ఎన్ని లాభాలో!

Black chana soaked water Benefits In telugu : మనం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. శనగలలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మనలో చాలా మంది శనగలను తింటారు… కానీ శనగలను నానబెట్టిన నీటిని పారబోస్తూ ఉంటారు. వీటిలో కూడా చాలా పోషక విలువలు ఉంటాయి.

నల్ల శనగలను శుభ్రంగా కడిగి రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఆ నీటిని వడకట్టి తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మనలో చాలా మంది శనగలను నానబెట్టిన నీటిని పారబోస్తూ ఉంటాం. ఈ నీటిని మన ఆరోగ్యానికి అమృతం అని నిపుణులు చెప్పుతూ ఉంటారు. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
chickpeas in telugu
ఈ నీటిని తాగటం వలన అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు. కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు. దాంతో బరువు తగ్గటానికి సహాయపడుతుంది. అలాగే అలసట,నీరసం,నిసత్తువ లేకుండా రోజంతా చురుకుగా ఉంటారు. డయబెటిస్ ఉన్నవారు ఈ నీటిని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
cholesterol
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు, చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు ప్రతి రోజు తాగితే చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగడం వల్ల పొట్ట శుభ్రపడుతుంది. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన గ్యాస్, అజీర్ణం, మంట, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు ఉండవు.

చర్మాన్ని అంతర్గతంగా శుభ్రపరచి చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది. ఈ నీటిలో ఫైబర్, ప్రొటీన్, కాల్షియం, విటమిన్‌లు ఉంటాయి. కాబట్టి శరీరంలోని అనేక సమస్యలను తొలగిస్తాయని నిపుణులు చెప్పుతున్నారు. ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.
blood thinning
నల్ల శనగల నీటిని అలాగే తాగవచ్చు. లేదా ఈ నీటిలో ఉప్పు, నిమ్మరసం లేదా తేనె కలుపుకొని కూడా తాగవచ్చు. అలాగే గోరువెచ్చగా చేసి కూడా తాగవచ్చు. ఇలా తాగటం కుదరని వారు ఈ నీటిని చపాతీ పిండి కలిపినప్పుడు ఉపయోగించవచ్చు. ఈ నీటిలో ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకున్నారుగా… ఈ నీటిని తీసుకొని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ