Devotional

Elinati shani effect:ఏలినాటి శని నుండి విముక్తి పొంది కుభేరులు కానున్న రాశులు..మీ రాశి ఉందా?

Elinati shani effect:జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహాన్ని న్యాయమూర్తిగా పరిగణిస్తారు. ఈ గ్రహం జాతకంలో రెండవ లేదా పన్నెండవ స్థానంలో సంచారం చేసినప్పుడు ఏలినాటి శని ప్రారంభమవుతుంది. శని గ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి ఎంతో స్లోగా సంచారం చేస్తుంది. ఇది సంచారం చేయడానికి దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు సంచారం సమయం పడుతుంది. అందుకే అన్ని రాశులు సంచారం చేయడానికి దాదాపు 30 సంవత్సరాల పాటు సమయం పడుతూ ఉంటుంది.

ఎవరికైనా ఏలినాటి శని ఉందంటే అనేక రకాలుగా ఇబ్బందులు,కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ధనస్సు,వృశ్చిక,మకర రాశి,కన్య,వృషభ రాశి వారికీ ఏలినాటి శని దశ నడుస్తుంది. ఈ రాశుల వారు ఇప్పుడు చెప్పబోయే పని శనివారం చేస్తే వారికీ శని కారణంగా వచ్చే ఇబ్బందులు,కష్టాలు అన్ని తొలగి జీవితం ఆనందంగా ఉంటుంది.

ఈ రాశుల వారు శనివారం శనీశ్వరునికి ఏ విధంగా చేస్తే ప్రతికూల ప్రభావాలను చూపకుండా అనుకూల ప్రభావాలను చూపి మనం చేసే ప్రతి పనిలో విజయం వచ్చేలా చేస్తారు. అంతేకాక కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. అందరు శనీశ్వరుణ్ణి చుసి భయాపడుతూ ఉంటారు. కానీ నీతి,నిజాయితీ ధర్మ బద్దంగా ఉండేవారి పట్ల శనీశ్వరుని కృప అపారంగా ఉంటుంది.

మన జీవితంలో శని దశ నడుస్తుందంటే ఆ తర్వాత భవిష్యత్ చాలా బాగుంటుందని అర్ధం. శనీశ్వరుడు శని దశలో ఎంత ఎక్కువగా పరీక్షిస్తే ఆ తర్వాత అంతకన్నా ఎక్కువగా ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. శని దశ ఉన్నప్పుడు చెడు దశ అని బాధపడవలసిన అవసరం లేదు.

శని దశ ఉన్నప్పుడు ఆ దశ నుండి తప్పించుకొని శని అనుగ్రహం పొందాలంటే ఏమి చేయాలో తెలుసుకుందాం. శనీశ్వర బాధలు తగ్గాలంటే ఆంజనేయ స్వామిని పూజించాలి శనివారం,మంగళ వారం ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉంటాం. ఒకసారి శనీశ్వరుడు ఆంజనేయస్వామి మీద తన ప్రతాపాన్ని చూపాలని ప్రయత్నించినప్పుడు ఆంజనేయస్వామి శనీశ్వరుణ్ణి తలక్రిందులుగా పెట్టి యోగాసనం వేయించారు.

దాంతో తన అపరాధాన్ని మన్నించమని శనీశ్వరుడు ఆంజనేయస్వామిని వేడుకోగా, అప్పుడు ఆంజనేయస్వామి శనీశ్వరుడితో నా భక్తులను పీడించకూడదు. ఒకవేళ బాధలు పెడితే మరల ఏను నీ దగ్గరకు వచ్చి శిక్షిస్తా అని చెప్పటంతో, శని ఆంజనేయస్వామికి మాట ఇచ్చాడు.

శనివారం ఆంజనేయస్వామికి పూజ చేస్తారో వారి మీద తన ప్రభావం ఉండదని శని చెప్పాడు. అందువల్ల శనివారం రోజు ఆంజనేయ స్వామికి తమలపాకులు, సిందూరంతో పూజ చేస్తే వారి జోలికి శనీశ్వరుడు వెళ్ళడు. అంతేకాక వారికీ చాలా మంచిని చేస్తాడు. ఆంజనేయస్వామికి తమలపాకు లంటే చాలా ప్రీతి. అందువల్ల శనివారం ఆంజనేయస్వామికి తమలపాకు,సిందూరం పూజ మరియు తమలపాకుల దండ వేయాలి.

సీతాదేవి అశోక వనంలో ఉన్నప్పుడు ఆంజనేయస్వామి రాముని సందేశం తీసుకువెళతారు. ఆ సమయంలో పువ్వులు ఏమి లేకపోవటంతో సీతాదేవి తమలపాకుల దండను ఆంజనేయస్వామి మెడలో వేస్తారు. అప్పటి నుంచి ఆంజనేయస్వామికి తమలపాకుల దండ అంటే చాలా ఇష్టం. అందువల్ల శనీశ్వర బాధలు లేకుండా ఉండాలంటే శనివారం ఆంజనేయస్వామికి తమలపాకుల దండ వేసి తమలపాకు,సిందూరంతో పూజ చేయాలి. ఇలా చేస్తే శని బాధలు తొలగిపోతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ