Weight Loss:ఈ టీ తాగితే చాలు..బెల్లీ ఫ్యాట్ త్వరగా కరుగుతుంది..!
Tea For Weight Loss:ఈ టీ తాగితే చాలు..బెల్లీ ఫ్యాట్ త్వరగా కరుగుతుంది.. ఈ మధ్య ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న సమస్యలలో అధిక బరువు అనేది ఒకటి. బరువు పెరగటం అయితే సులభంగా జరిగిపోతుంది. అదే పెరిగిన బరువును తగ్గించుకోవటానికి ఎన్నో రకాల ప్రయత్నాలను చేయాలి. అప్పుడే పలితం కనపడుతుంది.
ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా మనలో చాలా మంది దాదాపుగా పది మందిలో ఎనిమిది మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు సమస్య వచ్చినప్పుడు మనలో చాలామంది కంగారుపడి మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. .
అలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా మనం ఇంటిలోనే సహజసిద్ధంగా టీ తయారుచేసుకొని తాగితే చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. కాస్త ఓపికగా సమయాన్ని కేటాయిస్తే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. అధిక బరువు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. .
ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా బరువు తగ్గాలి. అధిక బరువు కారణంగా డయాబెటిస్., బ్లడ్ ప్రెషర్ గుండెకు సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అర స్పూను కుంకుమపువ్వు తీసుకుని కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టాలి.
పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోయాలి. నీరు కాస్త వేడెక్కాక దంచి పెట్టుకున్న కుంకుమపువ్వు, శుభ్రంగా కడిగిన 10 పుదీనా ఆకులు, అల్లం ముక్కలు, రెండు లెమన్ స్లైసెస్ వేసి ఏడు నుంచి పది నిమిషాల వరకు మరిగించాలి. ఆ తర్వాత ఈ నీటిని వడగట్టాలి. ఈ నీటిలో ఒక స్పూను నిమ్మరసం., ఒక స్పూను తేనె కలిపి ఉదయం లేదా సాయంత్రం సమయంలో తాగాలి. .
ఈ విధంగా ప్రతి రోజు తాగుతూ ఉంటే శరీరంలో క్యాలరీలు త్వరగా కరుగుతాయి. అలాగే అదనంగా ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. అలసట,నీరసం లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. శరీరంలో వ్యర్ధాలు అన్ని బయటకు పోతాయి. మైండ్ రిఫ్రెష్ అవుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. .
అధిక బరువు సమస్యతో బాధపడే వారే కాకుండా ఎవరైనా ఈ టీ తాగవచ్చు. ఈ టీ తాగడం వలన ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అధిక బరువు సమస్యతో ఉన్నవారు ప్రతిరోజు ఈ టీ తాగితే నార్మల్ గా ఉన్నవారు వారంలో రెండు లేదా మూడుసార్లు ఈ టీ తాగితే మంచిది. సీజనల్ గా వచ్చే సమస్యలు కూడా ఉండవు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ