Healthhealth tips in telugu

Lemon Water:నిద్ర లేచిన వెంటనే నిమ్మకాయ నీరు ఎందుకు తాగాలో తెలుసా…?

Lemon Water benefits :నిద్ర లేచిన వెంటనే నిమ్మకాయ నీరు ఎందుకు తాగాలో తెలుసా… నిమ్మకాయ దాదాపుగా సంవత్సరం పొడవునా లభ్యం అవుతుంది. అలాగే చాలా చవకగా దొరుకుతుంది. నిమ్మకాయలు దొరకని వారు సంవత్సరం పొడవునా నిల్వ చేసుకోవచ్చు. నిమ్మకాయలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

చలికాలం మొదలు అయిందంటే చాలు ఆ చలికి మన శరీరం చురుకుగా ఉండదు. అంతే కాకుండా మనల్ని ఒత్తిడి, మానసిక ఆందోళనలు సతమతం చేస్తుంటాయి. ఈ కారణంగా మన శరీరంలోని రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. పలు శ్వాసకోశ సమస్యలు, చలి జ్వరం వంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి.

అయితే వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే ఈ సీజన్‌లో ప్రతి రోజు నిమ్మరసం తాగాలి. గోరువెచ్చని నీటిని ఒక గ్లాస్‌లో తీసుకుని అందులో ఒక స్పూన్ నిమ్మరసం కలుపుకుని ఉదయాన్నే పరగడుపునే తాగితే ఎన్నో అద్భుతమైన లాభాలు కలుగుతాయని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

చలికాలంలో మామూలుగానే చర్మం పొడిబారుతుంది. కాబట్టి మనం ఉదయాన్నే నిమ్మరసం తాగడం వల్ల చర్మంలో తేమ అలాగే ఉంటుంది. దీంతో చర్మం మృదువుగా మారుతుంది. అలాగే నిమ్మరసంలో ఉండే విటమిన్ చర్మాన్ని సంరక్షిస్తుంది. చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. అంతే కాకుండా ఈ చలికాలంలో బాధించే శ్వాసకోశ సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు.

ఉదయాన్నే నిమ్మరసం తాగడం వల్ల దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరం వంటి సమస్యలు తగ్గుతాయి. చలికాలంలో సహజంగానే శరీర రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అయితే నిమ్మరసం తాగితే ఆ శక్తిని పెంచుకోవచ్చు. దీంతో ఇన్‌ఫెక్షన్లు, జ్వరాలు రాకుండా ఉంటాయి. ఉదయాన్నే నిమ్మరసం తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది.

దీంతో బరువు తగ్గవచ్చని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కిడ్నీలో రాళ్ళ సమస్యతో బాధపడుతున్నవారు, జీర్ణ సమస్యలతో బాధపడేవారు నిమ్మరసం తాగడం వల్ల ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే నోటి దుర్వాసన,దంతాలు, చిగుళ్ల స‌మ‌స్య‌లు తగ్గుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ