Deeparadhana:దీపారాధన సమయంలో తెలియకుండా చేసే తప్పులు ఇవే..!
Deeparadhana mistakes in telugu :దీపారాధన సమయంలో తెలియకుండా చేసే తప్పులు ఇవే..సాదరణంగా దీపారాధన చేసే సమయంలో చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. అలాగే కొంత మంది తెలియక కొన్ని తప్పులను చేస్తూ ఉంటారు. ఈ రోజు దీపారాదన ఏ సమయంలో చేయాలి. దీపాన్ని ఎన్ని వత్తులతో వెలిగించాలి. దీపారాదనకు ఏ నూనెను ఉపయోగించాలి. వంటి సందేహాలను తెలుసుకుందాం.
దీపం అంటే వెలుగు. దీపం వెలుగు మనలోని చీకటి అనే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానమనే దారిని చూపుతుంది. దీపం కాంతిలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అందువల్ల కొంత సేపు తదేకంగా దీపాన్ని చూస్తే కంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఇంటిలో కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. దీపం భగవంతుని స్వరూపం. దీపం వెలిగించిన చోట ప్రాణశక్తి ఉంటుంది.
ఆ ప్రాణ శక్తి దైవాన్ని ఆహ్వానిస్తుంది. దీపం వత్తి కాలిపోతూ వెలుగుని ఎలా ఇస్తుందో అలాగే దీపం యొక్క కిరణాలు మనలోని అజ్ఞానంను ప్రాలద్రోలి జ్ఞానాన్ని ఇస్తుంది. దీపాన్ని కొంత మంది ఉదయం,సాయంత్రం రెండు పూటలా పెడతారు. మరి కొంత మంది కేవలం సాయంత్రం మాత్రమే పెడతారు.
దీపం ఉదయం పెడితే మంచిదా సాయంత్రం పెడితే మంచిదా అనే విషయానికి వస్తే, సూర్యోదయ సమయంలో అంటే ఉదయం నాలుగున్నర గంటల నుంచి ఆరుగంటల లోపు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఆ బ్రహ్మ ముహర్త సమయంలో దీపం పెడితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్పుతున్నారు.
అయితే ఆ సమయంలో దీపం పెట్టటం కుదరక 11 లేదా 12 గంటలకు దీపారాధన చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేయటం చాలా తప్పు. సాధ్యమైనంత వరకు ఉదయం దీపారాధన చేయటమే మంచిది. ఉదయం ఆరు గంటల లోపు దీపారాధన చేయటం కుదరకపోతే ఉదయం ఎనిమిది గంటల లోపు చేయవచ్చు. ఇక సాయంత్రం విషయానికి వస్తే 6 నుంచి ఆరున్నర లోపు మాత్రమే దీపారాధన చేయాలి.
ఇలా చేస్తేనే మంచి ఫలితాలు కలుగుతాయి. దీపారాధన అనేది ఉదయం చేస్తేనే మంచిది. ఒకవేళ ఉదయం కుదరని పక్షంలో మాత్రమే సాయంత్రం దీపారాధన చేయాలి. అది కూడా 6 నుంచి ఆరున్నర లోపు మాత్రమే చేయాలి. దీపారాధన చేసేటప్పుడు రెండు వత్తులను వేయాలి. శాస్త్రం ప్రకారం ప్రతి రోజు చేసే దీపారాధనలో రెండు వత్తులను వేయాలి.
ఏదైనా ప్రత్యేక సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భానికి తగ్గట్టుగా వత్తులను వేసుకోవచ్చు. నిత్యా దీపారాధనలో మాత్రం రెండు వత్తులను వేయాలి. ఇక ఏ నూనెతో దీపారాధన చేయాలంటే… ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా పవిత్రంగా ఉంటుంది. ఆవు నెయ్యి తో చేయలేని వారు నువ్వులనూనెతో చేసినా మంచిదే. ఏ నూనెతో చేసినా దేవుని పట్ల భక్తితో చేయడం ముఖ్యం.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ