Beauty Tips

Hair growth tips: పొడవైన జుట్టు కావాలా? అయితే వీటిని ట్రై చేసి చూడండి

Alovera Hair Growth Tips In telugu : అందమైన జుట్టు కావాలని ఎవరికి ఆశ ఉండదు చెప్పండి. జుట్టు పొడవుగా పెంచుకోవడం కోసం మార్కెట్లో దొరికే ఉత్పత్తులు ఉపయోగించే బదులు సింపుల్ గా ఇంట్లో దొరికే ఈ పదార్థాలు ప్రయత్నించి చూడండి. మీ కోరిక చాలా త్వరగా తీరుతుంది. ఈ పదార్థాలు జుట్టు పెరుగుదలని ప్రేరేపిస్తాయి. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కుదుళ్ళని బలోపేతం చేస్తాయి.

సాదరణంగా ప్రతి ఒక్కరూ ఒత్తైన పొడవైన జుట్టు కావాలని కోరుకుంటారు. ఈ కాలంలో జుట్టు రాలే సమస్య ఎక్కువగా కనపడుతుంది. వాతావరణ పరిస్థితులు,ఆహారపు అలవాట్లు వంటి అనేక రకాల కారణాలతో జుట్టు రాలే సమస్య వస్తుంది. అలాగే చుండ్రు సమస్య కూడా ఎక్కువగానే ఉంటుంది.

ఈ సమస్యల పరిష్కారానికి మార్కెట్ లో దొరికే అనేక రకాల నూనెలను వాడుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్దమైన వస్తువులతో తయారుచేసిన నూనెను వాడితే చాలా మంచి ఫలితాన్ని చాలా తక్కువ సమయంలోనే పొందవచ్చు. ఈ నూనెను ఒక్కసారి తయారుచేసుకుంటే నెల రోజుల వరకు వాడుకోవచ్చు.

5 ఎర్ర మందార పువ్వులను తీసుకొను రేకలను విడతీసి పెట్టుకోవాలి. కలబంద ఒక మట్ట తీసుకొని రెండు వైపులా అంచులను కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక కప్పు నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె పోసి దానిలో మందార పువ్వుల రేకలు,కలబంద ముక్కలు, రెండు స్పూన్ల మెంతులు వేసి మరిగించాలి.

మందార పువ్వు రేకలు,కలబంద నలుపు రంగు వచ్చే వరకు మరిగించాలి. ఈ నూనె చల్లారాక సీసాలో వడకట్టి నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను ప్రతి రోజు జుట్టుకి పట్టించవచ్చు. లేదా రోజు విడిచి రోజు తలకు రాయవచ్చు. ఈ నూనెను రాసి సున్నితంగా 5 నిమిషాలు మసాజ్ చేస్తే రక్తప్రసరణ బాగా సాగి జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

ఈ నూనెను రాయటం మొదలు పెట్టిన 15 రోజులకు తేడా చాలా బాగా కనపడుతుంది. కాబట్టి కాస్త శ్రద్ద పెట్టి నూనెను తయారుచేసుకొని జుట్టుకి సంబందించిన సమస్యల నుండి బయట పడండి. చాలా తక్కువ ఖర్చుతో చాలా సులభంగా జుట్టు రాలే సమస్య,చుండ్రు సమస్య,తెల్లజుట్టు సమస్య నుండి బయట పడవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ