Devotional

Maha Shivratri 2025 ::శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ ఎలా చేస్తే మంచిదంటే..

Maha Shivratri 2025 :హిందూ పురాణాల ప్రకారం.. మహాశివరాత్రి పండుగకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ పర్వదినాన హిందువులు ఎంతో భక్తితో శివున్ని పూజిస్తుంటారు. ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో కృష్ణ పక్ష చతుర్దశి తిథి నాడు మహాశివరాత్రి వస్తుంది.

ఈ సంవత్సరం మహాశివరాత్రి మార్చి 8 శుక్రువారం రోజున వచ్చింది. శివుడి, పార్వతిదేవీల వివాహం జరిగిన రోజునే మహాశివరాత్రి పండుగగా మనం జరుపుకుంటాం. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళ, తమిళనాట కూడా శివరాత్రి పండుగని భక్తులు జరుపుకుంటారు.అయితే ఈ రోజున చాలామంది ఉపవాసం, జాగరణ చేస్తారు.

ఇలా చేయడం ఆనవాయితీగా వస్తుంది. రోజంతా ఏం తినకుండా.. రాత్రి కూడా నిద్ర పోకుండా భక్తులు ఆ శివుడిని కొలుస్తారు. అయితే.. ఉపవాసం, జాగరణ ఎలా చేస్తే మంచిదంటే రోజంతా భగవంతుని సన్నిధిలో ఆ భవంతుని చింతన, సేవలో ఉంటూ ఉండడమే ఉపవాసం అంటారు. అంతేకానీ, ఉపవాసమని చెప్పుకుంటూ ఏవేవో ఆలోచనలు చేయడం మంచిది కాదు.

ఇక జాగరణ అంటే భగవంతుని అస్థిత్వమునందు మన మనసు మేల్కొని ఉండడం. మేల్కొని ఉండడమంటే మేలుగా ఉండడమనే అర్థం.. ఈ రోజున భగవంతుని గురించే ఆలోచనలు, భజనలు, కథలు, స్థుతులు చేస్తూ మనసుని ఆ పరమాత్మపైనే కేంద్రీకరించి.. సమయం మొత్తం గడపడం ఇలా చేస్తేనే మనం చేసే జాగరణ, ఉపవాసానికి సార్థకత ఉంటుంది

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ