Naivedyam : ఏ దేవునికి ఏ నైవేద్యం పెడితే.. ఏ ఫలితం వస్తుందో తెలుసా ?
ప్రసాదం అనేది భగవంతుని పట్ల ఒక భావన, మనం ఏ దేవుడికి ప్రసాదం ఇవ్వాలో తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయం పాటించేవారు వారికీ ఇష్టమైన దేవుడికి పూజ చేసి నైవేద్యం పెడుతూ ఉంటారు. వారంలో ఒక్కో రోజు ఒక్కో దేవునికి ఇష్టమైన రోజు. ఆ రోజున పూజ చేసి ఆ దేవునికి ఇష్టమైన ఆహారాలను నైవేద్యంగా పెడితే శుభం మరియు మంచి కలుగుతుంది. ఇప్పుడు దాని గురించి వివరంగా తెలుసుకుందాం.
శ్రీరాముడు
శ్రీరామునికి పానకం, వడపప్పును నైవేద్యంగా పెట్టి పూజ చేస్తే అంతా మంచే జరుగుతుంది. దంపతులు కలిసి పూజ చేస్తే అనుకున్న కోరికలు నెరవేరతాయి. అంతేకాక వారి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది.
శివుడు
సోమవారం శివుణ్ణి పూజిస్తారు. శివునికి దద్దోజనం అంటే ఇష్టం. కాబట్టి దద్దోజనం నైవేద్యంగా పెట్టి పూజ చేస్తే కోరిన కోరికలు తీరతాయి.
అయ్యప్ప స్వామి
ప్రతి సంవత్సరం చాలా మంది భక్తులు అయ్యప్ప మాల వేసుకొని మాల తీయటానికి శబరిమలై వెళుతూ ఉంటారు. అయ్యప్ప స్వామికి పేలాలు అంటే చాలా ఇష్టం. అందువల్ల పేలాలు నైవేద్యంగా పెడితే కోరిన కోరికలు తీరతాయి.
శ్రీకృష్ణుడు
శ్రీకృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం. అందుకే ఆయనను వెన్న దొంగ అని పిలుస్తారు. శ్రీకృష్ణుడిని పూజించేటప్పుడు వెన్న పెడితే కోరుకున్న కోరికలు తీరతాయి.
ఆంజనేయ స్వామి
ఆంజనేయ స్వామి గొప్ప రామ భక్తుడు. రామున్ని ఆయన పూజించినట్టుగా ఎవరూ పూజించలేరు. ఈయనకు బెల్లం లేదా లడ్డూను నైవేద్యంగా పెట్టాలి.
లక్ష్మీ దేవి
చాలా మంది కేవలం శ్రావణ మాసంలోనే కాకుండా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. కొందరు వ్యాపారులు రోజూ ఆ దేవిని కొలుస్తారు. అయితే ఈమెకు పూర్ణాలు లేదా బూరెలను నైవేద్యంగా పెడితే దేవి అనుగ్రహం లభిస్తుంది.
వినాయకుడు
వినాయకుణ్ణి ఎప్పుడైనా పూజించవచ్చు. ఆయనకు పూజలు చేసినప్పుడు కుడుములు, ఉండ్రాళ్లు నైవేద్యంగా పెడితే మంచిది. అనుకున్న పనులు సకాలంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ