Beauty Tips

Warts Removing : పులిపిర్లు పోవాలా.. ఇలా చేయండి..

How to Remove Pulipiri in Telugu : పులిపిర్లు.. చిన్న సైజులో వేలాడే కురుపుల్లా ఉండే చాలా ఇబ్బందిగా ఉంటుంది.డయాబెటిస్ ఉన్నవారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కొల్లాజెన్ ఫైబర్స్ వదులుగా మారే పరిస్థితి ఇది. ఇది వయసు ఎక్కువగా ఉన్నవారు, అధిక బరువు ఉన్నవారిలో కనిపిస్తుంది. గజ్జలు, మెడ, కనురెప్పలు, చంకలు, రొమ్ములు, చర్మపు ముడతల దగ్గర కనిపిస్తుంది. ఇది ప్రమాదం కాదు. కానీ, బట్టలు, ఇతరవి ఏమైనా తగిలినప్పుడు నొప్పి, ఇబ్బందిగా అనిపిస్తుంది.

పులిపిర్లు అనేవి వయస్సుతో సంబందం లేకుండా వస్తాయి. పులిపిర్లు వాటి ఆకారంలో విభిన్నంగా ఉంటాయి,అంటే అనేక రకాల ఆకారాల్లో శరీరంపై ఏర్పడి,చూడటానికి అందవిహీనంగా కనపడతాయి.

పులిపిర్లు రాగానే మనలో చాలా మంది కంగారు పడి మార్కెట్ లో దొరికే కొన్ని క్రీమ్ లు వాడుతూ ఉంటారు. అలా వాడకుండా ఇంటి చిట్కాలను ట్రై చేయవచ్చు. పులిపిర్లు అనేవి వైరస్ కారణంగా వస్తాయి. అందువల్ల పులిపిర్లను తగ్గించుకోవటానికి తమలపాకు తొడిమలు బాగా సహాయపడతాయి.

4 లేదా 5 తమలపాకు తొడిమలను తీసుకొని మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ లో చిటికెడు సున్నం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి సమయంలో పులిపిర్లు ఉన్న ప్రదేశంలో రాసి దాని మీద టేప్ వేయాలి.

మరుసటి రోజు ఉదయం శుభ్రంగా కడిగితే సరిపోతుంది. సున్నితమైన చర్మం ఉన్నవారు అయితే రెండు గంటలు అయ్యాక శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పులిపిర్లు ఉన్న ప్రదేశంలో జాగ్రత్తగా పెట్టాలి. పక్కన ఉన్న చర్మానికి అంటితే మంట వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పులిపిర్లు చుట్టూ ఉన్న ప్రదేశంలో vaseline రాస్తే మంట వచ్చే అవకాశం ఉండదు.

రోగనిరోదక శక్తి తగ్గినప్పుడు పులిపిర్లు వస్తాయి. ఇప్పుడు చెప్పిన చిట్కాను ఫాలో అయితే చాలా తక్కువ సమయంలోనే పులిపిర్లు రాలిపోతాయి. దీని కోసం ఖరీదైన మందులు వాడవలసిన అవసరం లేదు. ఇలా చేసిన తగ్గకపోతే తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించాలి. ఏ ఆరోగ్య సమస్యను అసలు అశ్రద్ద చేయకూడదు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ