Healthhealth tips in telugu

Summer Tips:వేసవిలో ఫ్రిజ్ వాటర్ ఎక్కువగా తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..

Summer Tips:వేసవిలో ఫ్రిజ్ వాటర్ ఎక్కువగా తాగుతున్నారా.. అయితే జాగ్రత్త.. మనం ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నీటిని కచ్చితంగా తాగాలి. అప్పుడే శరీరం హైడ్రేట్ గా ఉండటమే కాకుండా శరీరంలో వేడి నియంత్రణలో ఉండి పేగు, చర్మ ఆరోగ్యానికి సహాయపడుతుంది. మన శరీరంలో నీరు తక్కువ అయితే ఆ ప్రభావం శరీరంలోని ప్రతి అవయం పనితీరు మీద పడుతుంది.

సరైన క్రమంలో మంచి నీటిని తప్పనిసరిగా తాగాలి. వేసవికాలంలో అయితే కాస్త ఎక్కువ తాగాలి. ఈ వేసవిలో పదేపదే గొంతు ఎండిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కువగా ఫ్రిజ్ వాటర్ తాగుతూ ఉంటారు. అయితే ఫ్రిజ్ వాటర్ తాగితే మంచిదేనా అనే విషయానికి వచ్చేసరికి..

బాగా చల్లగా ఉన్న నీటిని తాగితే జీర్ణక్రియ ప్రక్రియ నిదానంగా జరుగుతుంది. దాంతో ఆహారం జీర్ణం అవటం కష్టం అవుతుంది.ఎన్నో రకాల సమస్యలు వస్తాయి.. కాబట్టి ఫ్రిజ్ వాటర్ ఎక్కువగా తాగకూడదు.

బాగా చల్లగా ఉన్న నీటిని తాగితే పంటి నొప్పి, జివ్వుమన్న అనుభూతి వస్తుంది. ముఖ్యంగా దంతాలు చాలా సున్నితంగా ఉన్నవారికి ఈ సమస్య వస్తుంది.

చల్లని నీరు కొంతమందికి అస్సలు పడదు. అలాంటి వారికి చాలా త్వరగా గొంతు నొప్పి వస్తుంది. గొంతు నొప్పి వచ్చినప్పుడు వెంటనే ఫ్రిజ్ వాటర్ తాగడం మానేయాలి.

అంతేకాకుండా కొంతమందికి తలనొప్పి వస్తుంది. ఎందుకంటే ఈ కూలింగ్ వాటర్ తాగినప్పుడు వెన్నుముకలోని నరాలను చల్లబరిచి మెదడుపై ప్రభావం పడుతుంది. ఆ కారణంగా తలనొప్పి వస్తుంది.

శరీరంలో నిలువ ఉన్న కొవ్వుకు చల్లని నీరు తోడైతే కొవ్వు శాతం బాగా పెరిగిపోతుంది. బరువు తగ్గడంలో ఇబ్బంది వస్తాయి. బరువు తగ్గాలంటే ఫ్రిజ్ వాటర్ మానేయాలి.

ఫ్రిజ్ వాటర్ ని అవసరం అయినప్పుడు కొంచెం తాగవచ్చు. అలానే పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ ఎక్కువగా తాగితే మాత్రం సమస్యలు తప్పనిసరిగా వస్తాయి ఈ విషయాన్ని గుర్తించుకోండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."