Pregnancy planning:ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లో ఉన్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు… ముఖ్యమైన విషయాలు
Pregnancy planning:ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లో ఉన్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు… ముఖ్యమైన విషయాలు.. senior consultatnt nutritionist Dt Swetha Gangadhari మాటల్లో..
ముందుగా మనం ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అని ఆలోచిస్తామో అప్పుడు ఇమీడియట్ గా ఒక హెల్త్ కేర్ ప్రొఫెషనల్ని కానీ లేదా ఒక క్వాలిఫైడ్ లేదా రిజిస్టర్ డైటీషన్ కానీ కన్సల్ట్ అవ్వడం చాలా ముఖ్యం. ఎప్పుడూ కూడా గూగుల్ చేసి కానీ లేదా ఇన్ఫ్లుయెన్సెస్ ద్వారా కానీ డైట్ ప్లాన్స్ తీసుకోవడం కానీ లేదా గూగుల్లో టైప్ చేసి డైట్ పాటించడం వంటివి ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
ఒక సరైన ప్రొఫెషనల్ రిజిస్టర్ డైటీషియన్ లేదా క్వాలిఫైడ్ nutritionist దగ్గరికి వెళ్ళినప్పుడు మీ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్, మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అన్ని కూడా చెక్ చేసి దానికి అనుగుణంగా డైట్ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ లో వచ్చినటువంటి మెడికల్ రిపోర్ట్స్ లో కూడా పొరపాటున ఏదైనా న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఉంటే వాటిని కూడా మెరుగుపరుచుకుంటూ ప్రెగ్నెన్సీకి ప్లానింగ్ చేసుకోవడం జరుగుతుంది.
ఏదైనా విటమిన్ లేదా మినరల్ డెఫిషియన్సీస్ ఉండి ప్రెగ్నెన్సీ ప్లానింగ్ తీసుకున్నప్పుడు దీని యొక్క ప్రభావం బిడ్డ మీద కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఒక ప్రొఫెషనల్ అడ్వైజ్ తీసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. ఈ భాగంలో బాలన్స్ డైట్ ఫోకస్ చేయడం ముఖ్యం .మనం ఎప్పుడైతే అన్ని రకాల పోషకాలతో డైట్ ఫాలో అవుతామో అదే సరియైన ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీకి దారితీస్తుంది.
అలాగే హెల్తీ డెలివరీ కి కూడా హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే మనము ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కి సిద్దంగా ఉంటామో.. అప్పుడు ముందుగా తీసుకోవలసినటువంటి విటమిన్ సప్లిమెంట్ ఏదైనా ఉంటే డాక్టర్ హెల్ప్ కానీ క్వాలిఫైడ్ న్యూట్రిషన్ హెల్ప్ కానీ తీసుకొని ఆ మెడిసిన్స్ కానీ లేదా ఆ సప్లిమెంట్స్ కానీ స్టార్ట్ చేయవచ్చు. మేజర్ గా ఇక్కడ మనం ఫోకస్ చేసేది ఫోలిక్ యాసిడ్.. ఎప్పుడైతే మనం ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనుకుంటామో.. అప్పటి నుంచి ఫోలిక్ యాసిడ్ మెడికేషన్ స్టార్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్.
అలాగే మీ బరువు ఎప్పుడు కూడా ఒక హెల్ది వెయిట్ మెయింటైన్ అవ్వడానికి చూడండి. ఒకవేళ మీరు ఎక్కువగా ఓవర్ వెయిట్ ఉంటే చాలా ఫాస్ట్ లేదా రాపిడ్ వెయిట్ లాస్ తీసుకొని ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది కూడా అస్సలు మంచిది కాదు. దీనివల్ల గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ ఇతర ఏదైనా లివర్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
ఒకవేళ మీరు ఓవర్ వెయిట్ ఉన్న ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన మనం దానికి తగ్గ BMI క్యాలిక్యులేషన్ బేస్ చేసుకొని మనం ఫోకస్ చేయొచ్చు. అంతేకానీ ఓవర్ వెయిట్ ఉన్నామని చెప్పి ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లానింగ్ పెట్టుకుంటే గనుక ఇతర ఛాలెంజెస్ కూడా మనం ఫేస్ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీటితో పాటు మేనేజింగ్ యువర్ స్ట్రెస్.. సో ఈ స్ట్రెస్ అనేది మనం కంట్రోల్ చేసుకో లేకపోతే మన ఫెర్టిలిటీ ప్రాక్టిస్ మాక్సిమం చాలెంజెస్ అండ్ సక్సెస్ రేట్ తక్కువ.
నిద్ర కూడా ఈ జర్నీలో చాలా చాలా ఇంపార్టెంట్. సో నిద్ర సరిగ్గా లేదు.. అన్న క్వాలిటీ ఆఫ్ స్లీప్ మైంటైన్ చేయలేకపోయినా కూడా మనకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ రిజల్ట్ అనేది చాలా ఛాలెంజ్ గా ఉంటుంది. ఫైనల్ గా హైడ్రేషన్.. సో బాడీని ఎప్పుడూ కూడా హైడ్రేటెడ్ మోడ్ లో పెట్టుకోవాలి . వాటర్ ఇంటెక్ తీసుకోవడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ టైంలో తీసుకునేటువంటి మెడికేషన్స్ అయినా సప్లిమెంటేషన్ అయినా ప్రాపర్ అబ్సెప్షన్ ఉంటుంది.
ఈ ప్రాపర్ అబ్సెప్షన్ ఉండడం వల్ల మనం తీసుకునేటువంటి వాటి బెనిఫిట్స్ మన బాడీకి అందుతుంది. సో ఈ జాగ్రత్తలు పాటిస్తే కనుక ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకున్నప్పుడు హెల్దీ డే లో ఫెర్టిలిటీ ప్రోగ్రాంలో మనం సక్సెస్ అవ్వచ్చు. అలాగే అదే సమయంలో హెల్దీ ప్రెగ్నెన్సీ కూడా క్యారీ చేయొచ్చు. దీనిలో మీకు ఉన్న అనుమానాలను Dt Swetha Gangadhari తో మాట్లాడి నివృత్తి చేసుకోవచ్చు.
Dt Swetha Gangadhari
+91 98662 38365