Beauty Tips

Face Glow Tips:టమాటాతో ఇలా చేస్తే ఎంతటి నల్లని ముఖం అయినా 2 నిమిషాల్లో మెరిసిపోతుంది

Face Glow Tips:టమాటాతో ఇలా చేస్తే ఎంతటి నల్లని ముఖం అయినా 2 నిమిషాల్లో మెరిసిపోతుంది .. టమోటాలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు A & C లు సమృద్దిగా ఉనుద్త వలన చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి మరియు పునరుద్ధరించడానికి సహాయపడుతుంది.

దీని ఆస్ట్రిజెంట్ లక్షణాలు అదనపు నూనెను నియంత్రిస్తాయి. దాంతో మొటిమలు తగ్గుతాయి. అంతేకాక రంధ్రాలను తగ్గిస్తాయి. టమోటాను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మ ఆకృతి మెరుగుపడుతుంది, నల్ల మచ్చలు తొలగిపోతాయి మరియు ఆరోగ్యకరమైన మెరుపును ఇస్తుంది.

ఒక స్పూన్ టమాటా జ్యూస్ లో అర స్పూన్ కాఫీ పౌడర్ వేసి ముఖానికి పట్టించి పది నిమిషాలు అయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

ఒక స్పూన్ టమాటా జ్యూస్ లో అర స్పూన్ తేనె వేసి బాగా కలిపి ముఖానికి పట్టిస్తే మొటిమలు తొలగిపోతాయి.

ఒక స్పూన్ టమాటా జ్యూస్ లో అర స్పూన్ పసుపు వేసి ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మీద నల్లని మచ్చలు అన్ని తొలగిపోతాయి.

ఒక స్పూన్ టమాటా పేస్టు లో అర స్పూన్ పంచదార పొడి వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చర్మం మీద దుమ్ము ధూళి మృత చర్మ కణాలు అన్ని తొలగిపోతాయి.

టమాటా పేస్ట్ లో విటమిన్ ఈ ఆయిల్ కలిపి ముఖానికి రాస్తే ముడతలు అన్ని తొలగిపోతాయి.

టమాటా పేస్ట్ లో అర స్పూన్ బియ్యప్పిండి వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాలు అయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ