Kitchenvantalu

Rice Flour Bonda Recipe:బియ్యంపిండితో బొండాలు.. ఇలా చేయండి మంచి రుచిగా రౌండ్ గా వస్తాయి..

Rice Flour Bonda Recipe:బియ్యంపిండితో బొండాలు.. ఇలా చేయండి మంచి రుచిగా రౌండ్ గా వస్తాయి.. బియ్యంపిండితో స్నాక్ చేయాలని అనుకుంటే ఈ స్నాక్ ని ట్రై చేయవచ్చు.

కావాల్సిన పదార్థాలు
బియ్యం పిండి – 1 కప్పు
బొంబాయి రవ్వ – ¼ కప్పు
ఉల్లిపాయలు – 1 (సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి – 2 (సన్నగా తరిగినవి)
కరివేపాకు – 10-12 (తరిగినవి)
అల్లం – 1 టీస్పూన్ (తురిమినది)
జీలకర్ర (Cumin Seeds) – 1 టీస్పూన్
ఉప్పు (Salt) – రుచికి సరిపడా
నీళ్లు (Water) – అవసరమైనంత
నూనె (Oil) – వేయించడానికి

తయారీ విధానం (Preparation Method):
ఒక మిక్సీ జార్ లో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, తురిమిన అల్లం వేసి మిక్స్ చేయండి. ఒక గిన్నెలో బియ్యం పిండి, బొంబాయి రవ్వ, ఉప్పు, జీలకర్ర వేసి బాగా కలపండి. ఆ దీనిలో మిక్సీ చేసిన మిశ్రమం వేసి నీటిని పోస్తూ గట్టి పిండిలా (వడ పిండిలా) కలపండి.

పిండి నుండి చిన్న చిన్న ఉండలు చేస కడాయిలో నూనె వేడి చేసి, మీడియం మంట మీద ఉండలను వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించండి. వేడి వేడి బొండాలను కొబ్బరి చట్నీ లేదా టమాట సాస్‌తో సర్వ్ చేయండి. ఈ బొండాలు చాలా రుచిగా ఉంటాయి. సాయంత్రం సమయంలో మంచి స్నాక్ గా బాగుంటుంది.

చిట్కాలు (Tips):
పిండి చాలా గట్టిగా లేదా పలుచగా ఉండకూడదు.
నూనె బాగా వేడెక్కిన తర్వాతే బొండాలు వేయండి.. లేకపోతే నూనె ఎక్కువగా పీల్చుకుంటాయి.
రుచి కోసం కొత్తిమీర లేదా పుదీనా కూడా చేర్చవచ్చు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."