Raw Onion:వేసవిలో పచ్చి ఉల్లిపాయ తింటే ఎన్ని లాభాలో.. తెలిస్తే అసలు వదలరు..
Raw Onion:వేసవిలో పచ్చి ఉల్లిపాయ తింటే ఎన్ని లాభాలో.. తెలిస్తే అసలు వదలరు.. వేసవిలో కొన్ని ఆహారాలను తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా వేసవిలో పచ్చి ఉల్లిపాయ తింటే ఎన్నో లాభాలు పొందవచ్చు.
ఉల్లిపాయలు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి, వేసవి వేడి నుండి ఉపశమనం కలిగించటానికి చాలా బాగా సహాయపడతాయి. ఉల్లిపాయలలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండుట వలన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
ఉల్లిపాయలలో ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది. వేసవిలో వచ్చే జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.
యాంటీబాక్టీరియల్ గుణాలు చర్మ సమస్యలను తగ్గించటమే కకుండా వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచుతాయి.
ఉల్లిపాయలలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి సహాయపడుతుంది. ఉల్లిపాయలలో క్వెర్సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉనుద్త వలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. సలాడ్‌లలో, సాంబార్‌లో లేదా కూరలలో పచ్చి ఉల్లిపాయలను చేర్చడం ద్వారా ఈ ప్రయోజనాలను పొందవచ్చు.
ఉల్లిపాయలను చక్రాలుగా కోసి నిమ్మరసం, ఉప్పు,మిరియాల పొడి జల్లుకొని తినవచ్చు. రోజులో ఒక చిన్న ఉల్లిపాయ తింటే సరిపోతుంది. అయితే ఒక విషయాన్నీ గుర్తుంచుకోవాలి. అతిగా తినడం వల్ల కొందరికి గుండెల్లో మంట లేదా అజీర్ణం రావచ్చు, కాబట్టి మితంగా తినండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ