Healthhealth tips in telugu

Migraine headache:ఈ టిప్స్‌ పాటిస్తే ఐదు నిమిషాల్లో మైగ్రేన్‌, తలనొప్పి మాయం..

Migraine headache:ఈ టిప్స్‌ పాటిస్తే ఐదు నిమిషాల్లో మైగ్రేన్‌, తలనొప్పి మాయం.. మైగ్రేన్ తలనొప్పి వచ్చిందంటే ఒక పట్టాన తగ్గదు. మైగ్రేన్ తలనొప్పి అనేది కొన్ని గంటల నుండి కొన్ని రోజుల వరకు ఉంటుంది.

ఒత్తిడి, అలసట, నిద్ర లేకపోవడం వంటి అనేక రకాల కారణాలతో మైగ్రేన్ తలనొప్పి వస్తుంది. ఈ తలనొప్పి వచ్చినప్పుడు డాక్టర్ సూచనల ప్రకారం మందులను వాడుతూ ఇప్పుడు చెప్పిన చిట్కాలను కూడా ఫాలో అయితే తొందరగా ఉపశమనం కలుగుతుంది.

నీటిలో తడిసిన చల్లని గుడ్డను నుదురు లేదా మెడ వెనుక భాగంలో 10-15 నిమిషాలు ఉంచింటే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

అల్లం ముక్కలను నీటిలో వేసి టీ తయారు చేసి తాగండి. అల్లం యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు మైగ్రేన్ తీవ్రతను తగ్గిస్తాయి. లేదంటే రెగ్యులర్ లో తయారుచేసే టీలో కూడా వేసుకొని తాగవచ్చు.

పుదీనా నూనెను నుదురు మరియు కుడి భాగంలో మసాజ్ చేస్తే చాలా తొందరగా నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

శరీరంలో నీటి లోపం మైగ్రేన్‌ను ప్రేరేపిస్తుంది. కాబట్టి రోజూ 8-10 గ్లాసుల నీటిని తాగటానికి ప్రయత్నం చేయాలి.

మెగ్నీషియం లోపం కూడా మైగ్రేన్‌కు కారణం కావచ్చు. అరటిపండు లేదా బాదంపప్పు తినడం వల్ల మెగ్నీషియం అంది నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. మైగ్రైన్ తలనొప్పితో బాధపడుతున్నవారు ప్రతి రోజు ఆహారంలో బాదం,అరటి పండులను బాగం చేసుకోవాలి.

నిశ్శబ్దమైన, చీకటి గదిలో విశ్రాంతి తీసుకుంటే మైగ్రేన్ లక్షణాలను తగ్గిస్తుంది.

లవంగ నూనెను కొద్దిగా నుదురుపై రాయడం వల్ల నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

ఒక కప్పు కాఫీ లేదా టీ తాగడం వల్ల కొంతమందిలో మైగ్రేన్ తగ్గుతుంది, కానీ ఎక్కువగా తీసుకుంటే మంచిది కాదు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ