Kitchenvantalu

Ragi Dosa:రాగి దోశ కోసం పిండి ఇలా చేసుకొంటే దోశలు హోటల్ లో లా వస్తాయి ..

Ragi Dosa:రాగి దోశ:ఈ మధ్య కాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ద పెరిగి రాగులను ఎక్కువగా వాడుతున్నారు. రాగులతో అట్లు వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు చెప్పిన విధానంలో దోశలను వేసుకోండి.

కావాల్సిన పదార్థాలు:
– రాగిపిండి – 1 కప్పు
– రవ్వ – ¼ కప్పు
– బియ్యం పిండి – 1 టేబుల్ స్పూన్
– ఉప్పు – రుచికి తగినంత
– పెరుగు – ¼ కప్పు
– నీరు – అవసరమైనంత

తయారీ విధానం
ఒక గిన్నెలో రాగిపిండి, రవ్వ, బియ్యం పిండి, ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత దానిలో పెరుగు వేసి, కొద్దిగా నీటిని చేర్చుంటూ ఉండలు లేకుండా దోశ పిండి మాదిరిగా కలుపుకోవాలి. పిండిని బాగా కలిపాక మూతపెట్టి 15-20 నిమిషాలు నాననివ్వాలి.

స్టవ్ మీద పెనం వేడి చేసి, కొద్దిగా నూనె రాసి తుడిచి, పెనం కాస్త వేడి అయ్యాక (ఎక్కువ వేడి ఉంటే దోశ అంటుకుంటుంది) నానిన పిండిని తీసుకుని, పెనం మీద దోశలా పోసుకోవాలి. ఈ దోశ సాధారణ దోశలా పలుచగా ఉండదు.దోశ కొంచెం వేగిన తర్వాత, కొద్దిగా నూనె వేసి రెండు వైపులా కాల్చాలి.బాగా కాలిన దోశను ప్లేట్‌లోకి తీసుకోవాలి.

అలా దోశలను వేసుకోవాలి. అంతే ఎంతో ఆరోగ్యకరమైన రాగి దోశలు రెడీ. ఈ దోశలను చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఈ దోశలను కొబ్బరి, టమాట, లేదా ఏ చట్నీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు. రుచి అద్భుతంగా ఉంటుంది!

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."