Kitchenvantalu

Cabbage Pachadi : క్యాబేజీ పచ్చడి ఇలా చేశారంటే ఇష్టంగా తినేస్తారు.. మళ్లీ కావాలంటారు

Cabbage Pachadi : క్యాబేజీ పచ్చడి ఇలా చేశారంటే ఇష్టంగా తినేస్తారు.. మళ్లీ కావాలంటారు.. అన్నం కోసం ఎప్పుడూ కూరలు తింటే బోర్ కొడుతుంది కదా. అన్నంలోకి కాస్త భిన్నంగా ఎప్పుడైనా ట్రై చేశారా?

మీ ఇంట్లో క్యాబేజీ ఉంటే కూర వండితే తినేందుకు ఎవరూ ఇష్టం చూపించరు. కానీ దానిని పచ్చడి చేసి పెట్టండి ఎంజాయ్ చేస్తూ తింటారు. క్యాబేజీ పచ్చడి చేసేందుకు సమయం ఎక్కువగా పట్టదు. ఈజీగా చేసేయెుచ్చు. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.

కావాల్సిన పదార్థాలు:
– నూనె: 1 టేబుల్ స్పూన్
– జీలకర్ర: ½ టీస్పూన్
– ధనియాలు: 1 టీస్పూన్
– పచ్చిమిర్చి: 10 (లేదా రుచికి తగినన్ని)
– ఎండుమిర్చి: 4
– వెల్లుల్లి రెబ్బలు: 5
– క్యాబేజీ తరుగు: 150 గ్రాములు (సన్నగా తరిగినవి)
– పసుపు: ¼ టీస్పూన్
– చింతపండు: ఉసిరికాయంత
– టమాటాలు: 3
– ఉప్పు: రుచికి తగినంత

తాళింపు కోసం:
– నూనె: 1 టేబుల్ స్పూన్
– తాళింపు దినుసులు: ఆవాలు, జీలకర్ర, మినపప్పు
– వెల్లుల్లి రెబ్బలు: 2-3 (దంచినవి)
– కరివేపాకు: 1 రెమ్మ
– ఎండుమిర్చి: 2

తయారీ విధానం:
స్టవ్ ఆన్ చేసి, కడాయి వేడి చేయండి. నూనె వేసి, జీలకర్ర, ధనియాలు వేయించండి. అందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేగనివ్వండి.
తర్వాత క్యాబేజీ తరుగు, పసుపు వేసి బాగా కలపండి. మూత పెట్టి క్యాబేజీ మెత్తగా ఉడికే వరకు మగ్గించండి.

క్యాబేజీ ఉడికిన తర్వాత చింతపండు, టమాట ముక్కలు వేసి, మీడియం మంటపై టమాటాలు మెత్తగా అయ్యే వరకు కలుపుతూ ఉడికించండి. స్టవ్ ఆఫ్ చేసి, మిశ్రమం చల్లారే వరకు వేచి ఉంచండి. చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్‌లోకి తీసుకుని, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయండి.

పాన్ లో నూనె వేడి చేసి, తాళింపు దినుసులు, దంచిన వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించండి. వేగిన తాళింపులో గ్రైండ్ చేసిన పచ్చడిని వేసి బాగా కలపండి. స్టవ్ ఆఫ్ చేయండి. ఇలా చేస్తే రుచికరమైన క్యాబేజీ పచ్చడి సిద్ధం!

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."