Maha shivratri Tour:శివరాత్రి స్పెషల్: తక్కువ ఖర్చుతో 7 జ్యోతిర్లింగాల దర్శనం! IRCTC అదిరిపోయే ప్యాకేజ్.. వివరాలివే..
Maha shivratri Tour:శివరాత్రి స్పెషల్: తక్కువ ఖర్చుతో 7 జ్యోతిర్లింగాల దర్శనం! IRCTC అదిరిపోయే ప్యాకేజ్.. వివరాలివే.. శివరాత్రి పర్వదినాన శివయ్యను దర్శించుకోవాలని ఎవరికి ఉండదు? అందులోనూ దేశంలోని ప్రముఖ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటే ఆ పుణ్యమే వేరు.
భక్తుల కోరికను తీర్చేందుకు IRCTC ‘భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్’ ద్వారా ఒక అద్భుతమైన ప్యాకేజీని ప్రకటించింది. “సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర” పేరుతో సాగే ఈ టూర్ వివరాలు మీకోసం.
యాత్ర వివరాలు (Tour Highlights):
ప్రారంభ తేదీ: 2026, ఫిబ్రవరి 6 (మహాశివరాత్రి స్పెషల్).
యాత్ర సమయం: 10 రాత్రులు / 11 రోజులు.
కవర్ చేసే పుణ్యక్షేత్రాలు (7 జ్యోతిర్లింగాలు):
మహాకాళేశ్వర్ (ఉజ్జయిని)
ఓంకారేశ్వర్ (మధ్యప్రదేశ్)
నాగేశ్వర్ (ద్వారకా)
సోమనాథ్ (గుజరాత్)
భీమశంకర్ (పూణే)
త్రయంబకేశ్వర్ (నాసిక్)
ఘృష్ణేశ్వర్ (ఔరంగాబాద్)
బోర్డింగ్ పాయింట్లు: సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర (ధర్మాబాద్), ముద్ఖేడ్, నాందేడ్.
టికెట్ ధరలు (Packages):ఈ ప్యాకేజీలో రైలు ప్రయాణం, హోటల్ బస, ఉదయం టీ, టిఫిన్, మధ్యాహ్న మరియు రాత్రి భోజనం, ట్రావెల్ ఇన్సూరెన్స్ అన్నీ ఉంటాయి.
క్లాస్ (Class)
ఎకానమీ (Sleeper)… పెద్దలకు (Adult)…₹17,600… పిల్లలకు (5-11 ఏళ్లు)… ₹16,300
స్టాండర్డ్ (3rd AC).. పెద్దలకు (Adult)…₹26,700.. పిల్లలకు (5-11 ఏళ్లు)…₹25,200
కంఫర్ట్ (2nd AC).. పెద్దలకు (Adult)…₹34,600.. పిల్లలకు (5-11 ఏళ్లు)…₹32,800
రోజువారీ ప్లాన్ (Itinerary):
ఫిబ్రవరి 6: ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ నుంచి ప్రయాణం మొదలు.
ఫిబ్రవరి 7-8: ఉజ్జయిని మహాకాళేశ్వర్ దర్శనం, ఆ తర్వాత ఓంకారేశ్వర్ సందర్శన.
ఫిబ్రవరి 9-10: ద్వారకా చేరుకుని నాగేశ్వర జ్యోతిర్లింగ దర్శనం.
ఫిబ్రవరి 11: సోమనాథ్ ఆలయ దర్శనం.
ఫిబ్రవరి 12-13: పూణే చేరుకుని భీమశంకర ఆలయ దర్శనం.
ఫిబ్రవరి 14: నాసిక్ త్రయంబకేశ్వర్ దర్శనం.
ఫిబ్రవరి 15: ఔరంగాబాద్ ఘృష్ణేశ్వర్ ఆలయ దర్శనం.
ఫిబ్రవరి 16: తిరిగి సికింద్రాబాద్ ప్రయాణం.
ఎలా బుక్ చేసుకోవాలి?మొత్తం 750 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఆసక్తి గల భక్తులు IRCTC అధికారిక వెబ్సైట్ లేదా సికింద్రాబాద్ స్టేషన్లోని IRCTC కౌంటర్ని సంప్రదించి బుక్ చేసుకోవచ్చు. భారతీయ రైల్వే ఈ ప్యాకేజీపై 33% రాయితీని ఇస్తోంది కాబట్టి ధరలు అందుబాటులో ఉన్నాయి.

