Cold And cough:టాబ్లెట్లు మింగకండి.. ఈ ‘అర స్పూన్’ మిశ్రమంతో దగ్గు, జలుబు, జ్వరం పరార్!
Cold And cough:టాబ్లెట్లు మింగకండి.. ఈ ‘అర స్పూన్’ మిశ్రమంతో దగ్గు, జలుబు, జ్వరం పరార్.. వాతావరణం మారగానే ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, దగ్గు, జలుబు మొదలవుతాయా? అయితే, చిన్నపాటి జలుబుకే వెంటనే మెడికల్ షాప్‌కి వెళ్లి టాబ్లెట్లు వేసుకుంటున్నారా? అలా పదే పదే మందులు వాడితే శరీరంలో సహజమైన రోగనిరోధక శక్తి (Immunity) తగ్గిపోతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
మరి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్‌గా ఈ సమస్యలను ఎలా తగ్గించుకోవాలి? మన వంటింట్లో దొరికే కేవలం 4 వస్తువులతో అద్భుతమైన ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇక్కడ చూద్దాం.
కావాల్సిన పదార్థాలు ఇవే:
శొంఠి పొడి (Dry Ginger powder): పావు స్పూన్
మిరియాల పొడి (Black Pepper powder): పావు స్పూన్
పసుపు (Turmeric): చిటికెడు
తేనె (Honey): ఒక స్పూన్
ఎలా కలుపుకోవాలి? ఎలా వాడాలి?
ఒక చిన్న గిన్నెలో శొంఠి పొడి, మిరియాల పొడి, పసుపు వేసి బాగా కలపాలి.ఆ పౌడర్‌లో ఒక స్పూన్ తేనె వేసి మెత్తని పేస్ట్‌లా కలుపుకోవాలి.ఈ ‘అర స్పూన్’ మిశ్రమాన్ని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి చప్పరించి మింగాలి.ఇలా వరుసగా 2 రోజుల పాటు తీసుకుంటే గొంతు నొప్పి, దగ్గు, జలుబు, జ్వరం అన్నీ మాయం అవుతాయి.
ఇది ఎందుకు అంత పవర్‌ఫుల్?
శొంఠి, మిరియాలు, పసుపు, తేనె.. ఈ నాలుగింటిలోనూ యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ-సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో చేరిన వైరస్, బ్యాక్టీరియాలతో పోరాడి ఇన్ఫెక్షన్లను తరిమికొడతాయి. దీనివల్ల జబ్బులు తగ్గడమే కాకుండా, మీ శరీరంలో ఇమ్యూనిటీ రెట్టింపు అవుతుంది.
ఒక చిన్న చిట్కా..
బయట మార్కెట్లో దొరికే ప్యాకెట్ల కన్నా.. ఇంట్లో స్వయంగా దంచుకున్న శొంఠి, మిరియాల పొడి, పసుపు వాడటం ఎంతో మంచిది. అలాగే కల్తీ లేని ఆర్గానిక్ తేనె వాడితే రిజల్ట్ చాలా త్వరగా కనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. మీకు దగ్గు, జలుబు అనిపిస్తే వెంటనే ఈ న్యాచురల్ రెమెడీని ట్రై చేయండి!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

