జిమ్ అవసరం లేదు, డైట్ కూడా కాదు! ఈ 6 ఆహారాలు తింటే శరీర కొవ్వు వెన్నలా కరుగుతుంది
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో వ్యాయామం చేయడానికి సమయం దొరక్కపోవడం, గంటల తరబడి ఒకేచోట కూర్చుని పనిచేయడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, థైరాయిడ్ లాంటి సమస్యల వల్ల చిన్న వయసులోనే చాలామంది ‘అధిక బరువు’ బారిన పడుతున్నారు.
బరువు తగ్గాలంటే కఠినమైన వ్యాయామాలు, కడుపు మాడ్చుకునే డైట్‌లు చేయాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో దొరికే కొన్ని సింపుల్ ఆహారాలతో శరీరంలో పేరుకుపోయిన మೊಂಡು కొవ్వును వేగంగా కరిగించుకోవచ్చు. ఆ అద్భుతమైన ఫుడ్స్ ఏంటో ఇక్కడ చూద్దాం..
1. ఓట్స్ (Oats) – పర్‌ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్
బరువు తగ్గాలనుకునే వారికి ఓట్స్ ఒక వరం లాంటివి. ఇందులో ఉండే కరిగే ఫైబర్ (Soluble Fiber) రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రోజూ ఉదయం అల్పాహారంగా ఒక కప్పు ఓట్స్ ఉడికించి తింటే.. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు ఇట్టే కరిగిపోతుంది.
2. పియర్స్ పండ్లు (Pears) – తీయని ఫ్యాట్ బర్నర్
యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ పుష్కలంగా ఉండే పియర్స్ పండ్లు శరీరంలో కొత్తగా కొవ్వు నిల్వలు ఏర్పడకుండా అడ్డుకుంటాయి. రోజూ ఒక పియర్స్ పండును స్నాక్ గా తీసుకుంటే ఆరోగ్యంగా బరువు తగ్గుతారు.
3. నిమ్మ + వేడి నీళ్లు – మ్యాజిక్ డ్రింక్
ప్రతిరోజూ ఉదయం పరగడుపున, అలాగే సాయంత్రం వేళ ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నిమ్మరసం కలుపుకుని తాగండి. ఇది శరీరంలోని వ్యర్థాలను (Toxins) బయటకు పంపి, అదనపు కొవ్వును వేగంగా కరిగిస్తుంది.
4. గ్రీన్ టీ (Green Tea) – మెటబాలిజం బూస్టర్
గ్రీన్ టీలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ జీర్ణ ప్రక్రియను (Metabolism) వేగవంతం చేస్తాయి. దీనివల్ల శరీరం త్వరగా క్యాలరీలను ఖర్చు చేసి, బరువు తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.
5. టొమాటోలు (Tomatoes) – పోషకాల గని
కూరల్లో రుచి కోసమే కాకుండా.. బరువు తగ్గడంలోనూ టొమాటోల పాత్ర కీలకం. ఇందులోని విటమిన్లు, ప్రోటీన్స్, ఫైబర్ శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును కరిగించి మిమ్మల్ని స్లిమ్ గా మారుస్తాయి.
👉 ఇంకా చదవండి:షుగర్ కంట్రోల్ చేయడంలో ఏది బెస్ట్.. జీలకర్ర నీళ్లా? లేక మెంతి నీళ్లా? అసలు సీక్రెట్ ఇదే!
6. పచ్చిమిర్చి (Green Chilies) – ఆశ్చర్యపరిచే నిజం
చాలామంది కారంగా ఉంటాయని పచ్చిమిర్చిని పక్కన పెడుతుంటారు. కానీ, పచ్చిమిర్చిని ఆహారంలో భాగంగా చేసుకుంటే బరువు సులభంగా తగ్గవచ్చని ఇటీవల జరిగిన పరిశోధనల్లో తేలింది. ఇవి శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో బెస్ట్ మెడిసిన్ లా పనిచేస్తాయి.
చిన్న గమనిక: ఈ ఆహారాలను తీసుకుంటూనే, రోజులో కనీసం 30 నిమిషాలు నడవడం, తగినన్ని నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే వారం రోజుల్లోనే మీ శరీరంలో మార్పు చూస్తారు!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

