Beauty Tips

Skin care tips:శరీరమంతా తెల్లగా ఉన్నా.. మోచేతులు, మోకాళ్లు మాత్రం నల్లగా ఉన్నాయా? ఈ 2 రూపాయిల చిట్కాతో మెరిపించండి!

Skin care tips:శరీరమంతా తెల్లగా ఉన్నా.. మోచేతులు, మోకాళ్లు మాత్రం నల్లగా ఉన్నాయా? ఈ 2 రూపాయిల చిట్కాతో మెరిపించండి.. చాలా మందికి ముఖం, శరీరం తెల్లగా ఉన్నప్పటికీ.. మోకాళ్లు, మోచేతులు మాత్రం మొండిగా నలుపు రంగులో ఉండిపోతాయి.

బయటకు వెళ్ళినప్పుడు షార్ట్ డ్రెస్సులు వేసుకోవాలన్నా, హాఫ్ హ్యాండ్స్ షర్ట్స్ వేసుకోవాలన్నా ఈ నలుపు వల్ల చాలా మంది ఇబ్బందిగా (Embarrassing) ఫీల్ అవుతుంటారు. మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీములు వాడి విసిగిపోయారా? అయితే మీ వంటింట్లో ఉండే ఈ వస్తువులతో కేవలం 15-20 నిమిషాల్లో ఆ మొండి నలుపును వదిలించుకోవచ్చు.

కావలసిన పదార్థాలు:
షాంపూ: ఒక చిన్న ప్యాకెట్ (మీరు రెగ్యులర్ గా వాడేది ఏదైనా పర్వాలేదు)
నిమ్మరసం: అర చెక్క
టమోటా రసం: 2 స్పూన్లు
పసుపు: పావు స్పూన్ (ఆర్గానిక్ పసుపు అయితే ఇంకా మంచిది)

తయారీ విధానం & ఎలా ఉపయోగించాలి?
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో షాంపూ వేయండి.దానిలో నిమ్మరసం, టమోటా రసం మరియు పసుపు వేసి బాగా మిక్స్ చేయండి. అన్నీ కలిసేలా బాగా కలిపితే ఒక చిక్కటి పేస్ట్‌లా తయారవుతుంది.

ఈ మిశ్రమాన్ని మోకాళ్లు, మోచేతులపై నలుపు ఉన్న చోట అప్లై చేయండి.ఒక రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయండి.దాదాపు 30 నిమిషాల పాటు అలాగే ఆరనివ్వండి.చివరగా గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.

ఇది ఎలా పనిచేస్తుంది?
టమోటా మరియు నిమ్మరసంలో సహజసిద్ధమైన బ్లీచింగ్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మంపై పేరుకుపోయిన డెడ్ సెల్స్ (మృతకణాలు) మరియు మొండి నలుపును తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తాయి. పసుపు యాంటీ సెప్టిక్‌గా పనిచేసి చర్మానికి మంచి మెరుపును ఇస్తుంది.

ముఖ్య గమనిక:
ఈ చిట్కాను ప్రతిరోజూ లేదా వారానికి మూడు సార్లు క్రమం తప్పకుండా పాటిస్తే, మీ మోకాళ్లు, మోచేతులు మృదువుగా మారి, క్రమంగా తెల్లబడతాయి. ఇక నుంచి బ్యూటీ పార్లర్లకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇంటి చిట్కాలతోనే మెరిసే చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.

సూచన: ఇది కేవలం అవగాహన కోసం అందించిన సమాచారం మాత్రమే. మీకు సున్నితమైన చర్మం (Sensitive Skin) ఉంటే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."