ఉదయం టీ, కాఫీలు తాగుతున్నారా? అయితే వాటికి బదులు ఈ ‘మ్యాజిక్ జ్యూస్’ తాగితే రక్తహీనత పరార్!
ఉదయం నిద్ర లేవగానే వేడివేడిగా ఓ కప్పు కాఫీ లేదా టీ పడకపోతే చాలామందికి రోజు గడవదు. ఏదో వెలితిగా అనిపిస్తుంది. కానీ, ఖాళీ కడుపుతో వాటిని తాగడం కంటే.. మన ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే ఓ అద్భుతమైన జ్యూస్ తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా రక్తహీనత (Anemia) తో బాధపడేవారికి ఇది సంజీవనిలా పనిచేస్తుంది.
మరి ఆ అద్భుతమైన జ్యూస్ ఎలా తయారు చేయాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
జ్యూస్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
చిన్న బీట్ రూట్ – 1 (తొక్క తీసి కట్ చేసినవి)
టమాటాలు – 2
దానిమ్మకాయ గింజలు – 1 కప్పు
ఎండు ద్రాక్షలు (కిస్మిస్) – 5
గింజ తీసిన ఖర్జూరాలు – 3
నీళ్లు – 1 గ్లాసు
ఎలా తయారు చేయాలి?
ముందుగా బీట్ రూట్, టమాటాలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో బీట్ రూట్, టమాటా ముక్కలు, దానిమ్మ గింజలు వేయండి.
ఆ తర్వాత అందులోనే ఎండు ద్రాక్షలు, ఖర్జూరాలు, ఒక గ్లాసు నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.చివరగా ఈ మిశ్రమం నుంచి జ్యూస్ ను ఫిల్టర్ చేసుకుని ఉదయం పూట తాగాలి.
ఈ జ్యూస్ తాగడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు:
రక్తహీనతకు చెక్: ఇందులో వాడిన బీట్ రూట్, దానిమ్మ వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం వేగంగా పెరుగుతుంది. రక్తహీనత సమస్య ఇట్టే మాయమవుతుంది.
ఇమ్యూనిటీ బూస్టర్: శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. దీంతో తరచుగా వచ్చే అనారోగ్య సమస్యలు దరిచేరవు.
మెదడు చురుకుదనం: ఈ జ్యూస్ క్రమం తప్పకుండా తాగితే జ్ఞాపకశక్తి రెట్టింపు అవుతుంది. ఎలాంటి ఒత్తిడి లేకుండా మెదడు యాక్టివ్ గా పనిచేస్తుంది.
బరువు తగ్గుతారు: శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును, వ్యర్థాలను కరిగించి బరువు తగ్గేలా చేస్తుంది.
రోజంతా ఎనర్జీ: ఉదయాన్నే ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల నీరసం, అలసట దరిచేరవు. రోజంతా ఎంతో ఉత్సాహంగా, చురుకుగా ఉంటారు.
చెడు కొలెస్ట్రాల్‌ను మంచులా కరిగించే ‘సూపర్ ఫ్రూట్స్’ ఇవే.. ఈ పండ్లు తింటే మీ గుండె పదిలం!
ఈ మధ్యకాలంలో వయసు, ఆడ, మగ అనే తేడా లేకుండా చాలామంది రక్తహీనత బారిన పడుతున్నారు. కాబట్టి, దీన్ని ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా.. ఉదయం టీ, కాఫీలకు బదులుగా కాస్త ఓపిక చేసుకుని ఈ జ్యూస్ తాగడం అలవాటు చేసుకోండి.
గమనిక: ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని వైద్య సలహాగా భావించకూడదు. పాటించే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

