Healthhealth tips in teluguKitchen

జీలకర్రతో లాభాలే కాదు.. ఈ పొరపాట్లు చేస్తే భారీ మూల్యం తప్పదు!

Cumin Seeds Side Effects In telugu: జీలకర్రలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కార్బోహైడ్రేట్లు,విటమిన్స్, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, డైటరీ ఫైబర్, నియాసిన్, ఫోలేట్ ఇందులో ఉంటాయి. జీలకర్ర వంటలకు మంచి రుచిని అందిస్తుంది. ప్రతి రోజు వంటలలో జీలకర్రను దాదాపుగా ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తారు.
cumin seeds
జీలకర్ర తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది, అలాగే జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ఎన్నో ఇంటి చిట్కాలలో జీలకర్రను ఉపయోగిస్తూ ఉంటాం. జీలకర్రను లిమిట్ గా వాడితే వాటిలో ఉన్న ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి. జీలకర్రను ఎక్కువగా వాడితే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

జీలకర్రతో జీర్ణక్రియ మెరుగుపడుతుందనేది నిజమే, కానీ అందరికీ ఇది మేలు చేయదు. ముఖ్యంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జీలకర్రను అతిగా తీసుకుంటే పరిస్థితి విషమించవచ్చు. ఆ సమస్యలు ఏంటో ఇప్పుడే తెలుసుకోండి.

మసాలా దినుసుగా జీలకర్రకు మంచి పేరుంది. అయితే డయాబెటిస్, బ్లడ్ క్లాటింగ్ వంటి సమస్యలు ఉన్నవారు దీనిని వాడేటప్పుడు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? నిపుణులు ఏం చెబుతున్నారో ఈ ఆర్టికల్‌లో చూడండి.

ప్రతి వంటింట్లో ఉండే జీలకర్ర అమృతంలా పనిచేస్తుంది, కానీ కొందరికి ఇది విషంలా మారవచ్చు. ముఖ్యంగా సర్జరీ జరగాల్సిన వారు లేదా గర్భిణీలు జీలకర్ర విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?
gas troble home remedies
జీలకర్రకు వేడి కలిగించే గుణం ఉంటుంది. అందువల్ల కడుపులో మంటగా అనిపిస్తే, ఆహారంలో జీలకర్రను ఎక్కువగా వాడకూడదు . జీలకర్ర ఎక్కువగా తినడం వల్ల కడుపులో మంట పెరుగుతుంది. అలాగే గ్యాస్, పుల్లటి నొప్పులు ఉన్నవారు కూడా జీలకర్రకు దూరంగా ఉంటేనే మంచిది. ఒకవేళ జీలకర్రను తీసుకుంటే సమస్య తీవ్రం అవుతుంది.

గర్భధారణ సమయంలో కూడా జీలకర్రను అధికంగా తీసుకోవడం మానేయాలి. ఇది గర్భధారణపై ప్రభావం చూపుతుంది. గర్భధారణ సమయంలో జీలకర్ర ఎక్కువగా తినడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. కిడ్నీలు దెబ్బ తినే ప్రమాదం కూడా ఉంది మన శరీరానికి ఫిల్టర్ గా పనిచేసే కిడ్నీల పనితీరు దెబ్బతింటుంది అందువలన లిమిట్ గా తీసుకోవాలి.
Weight Loss Drink In Telugu
బరువు తక్కువగా ఉన్నవారు జీలకర్రను ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే జీలకర్రలో ఉన్న పోషకాలు శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించి బరువు తగ్గటానికి సహాయపడుతుంది. జీలకర్రను తక్కువ పరిమాణంలో తీసుకోవచ్చు. కాబట్టి జీలకర్ర తీసుకొనే ముందు ఈ విషయాలను గుర్తు పెట్టుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."