Beauty Tips

ముఖంపై మచ్చలు, మొటిమలు మాయం.. కలబందలో ఈ ఒక్కటి కలిపి రాసి చూడండి!

వాతావరణంలో కాలుష్యం, మారిన జీవనశైలి, ఒత్తిడి వంటి అనేక రకాల కారణాలతో మనలో చాలామంది ముఖంపై మొటిమలు, నల్లని మచ్చలు, ఫిగ్మెంటేషన్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.

ఈ సమస్యలు లేకుండా ముఖం కాంతివంతంగా మెరవాలంటే మార్కెట్లో ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. కానీ మన ఇంటిలో చాలా తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండే కలబందతో ఈరోజు ముఖాన్ని అందంగా ఎలా మెరిపించాలో తెలుసుకుందాం.

కలబందలో పసుపు, రోజ్ వాటర్ వేసి బాగా కలిపి ముఖానికి రాసి 10 నిమిషాలు అయ్యాక చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు.

కలబందలో నిమ్మరసం కలిపి ముఖానికి పట్టిస్తే మొటిమలు. వాటి కారణంగా వచ్చే నల్లని మచ్చలను తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి. కలబంద లో ఉండే యంటి బ్యాక్టీరియా లక్షణాలు మొటిమలను చాలా వేగంగా తగ్గిస్తాయి.

కలబందలో విటమిన్ ఈ క్యాప్సిల్ లోని నూనెను వేసి బాగా కలిపి ముఖానికి పట్టిస్తే వయసు పెరిగే కొద్దీ వచ్చే సమస్యలు ముఖ్యంగా ముడతలు తగ్గి యవ్వనంగా కనబడతారు.

ఇప్పుడు చెప్పుకున్న చిట్కాలో ఉపయోగించిన కలబంద, పసుపు, విటమిన్ ఈ క్యాప్సిల్.. ఇవన్నీ మనకు చాలా సులభంగా అందుబాటులోనే ఉంటాయి అంతే కాకుండా చాలా చాలా తక్కువ ఖర్చుతో ఈ చిట్కాలను ఫాలో అవ్వవచ్చు. సాధారణంగా ప్రతి ఇంటిలోనూ కలబంద మొక్క ఉంటుంది. కాబట్టి ఈ చిట్కాను చాలా సులువుగానే ఫాలో అవ్వచ్చు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."