Healthhealth tips in telugu

రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కరగాలంటే.. వారంలో 2 సార్లు ఈ ఆకుకూర తినాల్సిందే!

అన్ని కాలాల్లోనూ చాలా విరివిగా, చాలా చవకగా లభ్యం అయ్యే ఆకుకూరలను ఆహారలో భాగంగా చేసుకుంటే ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మారిన పరిస్థితుల కారణంగా మనకు ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది.

ఈ సమస్య అనేది డయాబెటిస్ ఉన్న వారిలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమస్యతో బాధపడేవారు కొన్ని ఆహారాలను ఆహారలో భాగంగా చేసుకుంటే మంచి ప్రయోజనం కనబడుతుంది అలాంటి ఆహారం ఏమిటి అనేది చూద్దాం. బచ్చలి కూర చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది.

వారంలో రెండు సార్లు తింటే మంచి ప్రయోజనం కలుగుతుంది. బచ్చలకోరులో ఉండే బ్లూటీన్ అనే బ్లూటీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు ధమని గోడలకు అడ్డుపడే కొలెస్ట్రాల్ను కరిగించి గుండెకు సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది.

రక్తనాళాల్లో కొవ్వును కరిగించడానికి దీనిలో ఉండే ఫైబర్ సహాయపడుతుంది. అలాగే బచ్చలి కూరలో ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. ఈ మధ్యకాలంలో చాలామంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు.

ఇలాంటివారు బచ్చల కూర తింటే చాలా మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. అలాగే శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడే విటమిన్ సి కూడా ఈ ఆకుకూరలో చాలా సమృద్ధిగా ఉంటుంది. మన శరీరంలో ఇమ్యూనిటీ బాగుంటే ఎటువంటి వ్యాధులు రావు.

బచ్చల కూర తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా రక్షిస్తుంది. అంతేకాకుండా మూత్ర సంబంధిత సమస్యలను తగ్గించడానికి కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఒకసారి డాక్టర్ని సంప్రదించి ఆ తర్వాత తింటే మంచిది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."