Healthhealth tips in telugu

పుదీనా Vs కొత్తిమీర: వేసవిలో ఈ రెండింటిలో ఏది తింటే ఆరోగ్యానికి బెస్ట్? సైన్స్ ఏం చెబుతోంది?

సాధారణంగా ఆకుకూరలు అనేవి రెగ్యులర్ గానే అందుబాటులో ఉంటాయి. అలాగే మామూలు కూరగాయలతో పోలిస్తే ఆకుకూరలు కాస్త చవకగా ఉంటాయి. అయితే కొత్తిమీర, పుదీనా ఈ రెండింటిలో మనకు ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు దేనిలో కలుగుతాయో తెలుసుకుందాం.

పుదీనా, కొత్తిమీర ఈ రెండింటిలోనూ పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఈ రెండింటిలోనూ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. కొత్తిమీరను శుభ్రంగా కడిగి ఆరబెట్టి పొడిగా తయారు చేసుకుని నిలవ చేసుకోవచ్చు ఈ పొడిని కూరల్లో వేసుకోవచ్చు. అలాగే పుదీనాను కూడా పొడిగా తయారు చేసుకుని వాడవచ్చు.

కొత్తిమీర ప్రయోజనాల విషయానికి వచ్చేసరికి డయాబెటిస్ ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఈ మధ్యకాలంలో చాలా చిన్న వయసులోనే డయాబెటిస్ అనేది వచ్చేస్తుంది. కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన ఆర్సీకరణ ఒత్తిడి కారణంగా వచ్చే కణాల డ్యామేజీని తగ్గిస్తుంది.

అలాగే శరీరంలో మంటను తగ్గిస్తుంది. శారీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా న్యూరో ప్రొటెక్టివ్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడమే కాకుండా రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండెకు ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

ఆల్జీమర్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.కొత్తిమీర జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించి జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేస్తుంది. ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది.

ఇక పుదీనా విషయానికి వచ్చేసరికి కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. పుదీనాలో ఉండే మెంధాల్ కండరాలను సడలించటంలో సహాయపడుతుంది.

విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వలన కంటికి సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా కళ్ళు ఆరోగ్యంగా ఉండేలా సహాయపడుతుంది.. అలాగే వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటికి సంబంధించిన సమస్యలు రాకుండా కాపాడుతుంది.

పుదీనాలో మెంథల్ ఉండటం వలన జీర్ణ సంబంధ సమస్యలైనా కడుపుబ్బరం, గ్యాస్, కడుపునొప్పి వంటివి లేకుండా చేస్తుంది. శ్వాస సమస్యలకు చెక్ పెడుతుంది. ముఖ్యంగా నోటి దుర్వాసన తగ్గించడమే కాకుండా నోటి దుర్వాసనకు కారణమైన బ్యాక్టీరియాను కూడా నిర్మూలిస్తుంది.

మెదడు ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.. పుదీనాతో పోలిస్తే కొత్తిమీరలోనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మనకు లభ్యమైన దాన్ని బట్టి కొత్తిమీర లేదా పుదీనా ఈ రెండింటిని వాడటం అలవాటు చేసుకోండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."