HealthKitchenvantalu

బరువు తగ్గాలా? రాత్రి పూట జొన్న సూప్ తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా!

Jowar soup తాగితే ఊహించని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ మధ్యకాలంలో మారిన పరిస్థితుల కారణంగా అందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతున్నారు.

జొన్నలు, సజ్జలు, రాగులు వంటి వాటిని తీసుకునే వారి సంఖ్య కూడా చాలా పెరిగింది. ఇక జొన్న పిండితో soup ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. జొన్న పిండి మార్కెట్లో లభ్యమవుతుంది.. లేదంటే ఇంటిలోనే తయారు చేసుకోవచ్చు.

మిక్సీ జార్ లో అర స్పూన్ జీలకర్ర, ఒక పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క వేసుకొని మెత్తని పేస్ట్ గా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ లో మూడు స్పూన్ల జొన్నపిండి వేసి దానిలో అరకప్పు నీటిని పోసి ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.

ఆ తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి రెండు గ్లాసుల నీటిని పోసి నీరు కాస్త వేడి అయ్యాక రెండు స్పూన్ల క్యారెట్ తురుము, మూడు స్పూన్ల స్వీట్ కార్న్, రెండు స్పూన్ల గ్రీన్ బఠానీ వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత దానిలో జీలకర్ర, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఐదు నిమిషాలు మరిగించాలి.

ఆ తర్వాత కలిపి పెట్టుకున్న జొన్న పిండి మిశ్రమము, ఉప్పు వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగిస్తే ఎంతో రుచికరమైన జొన్న పిండితో సూప్ రెడీ.

ఈ సూప్ ని ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకోవచ్చు. లేదంటే సాయంత్రం సమయంలో తీసుకోవచ్చు. వారంలో రెండు సార్లు తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. కాబట్టి కాస్త ఓపికగా ఈ సూప్ తయారుచేసుకొని తాగటానికి ప్రయత్నం చేయండి.

ఈ సూప్ తాగడం వలన రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. జీర్ణ సంబంధ సమస్యలు ఏమి ఉండవు. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి రక్త సరఫరా బాగా సాగేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఈ సూప్ లో ప్రోటీన్స్ సమృద్ధిగా ఉండటం వలన నీరసం లేకుండా శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."