రోజుకో ‘ఉసిరికాయ’ తింటే మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే.. అసలు నమ్మలేరు!
కొంచెం వగరు, కొంచెం పులుపు కలయికతో ఉండే ఉసిరి.. ఆయుర్వేదంలో ఒక దివ్యౌషధం. రోజూ ఉదయం పరగడుపున ఒక్క ఉసిరికాయ తింటే శరీరానికి జరిగే మేలు అంతా ఇంతా కాదు. అవేంటో ఇక్కడ చూద్దాం.
ఉసిరితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
విటమిన్-C కి పవర్ హౌస్: ఒక్క ఉసిరికాయ తినడం, రెండు నారింజ పండ్లు తినడంతో సమానం. విటమిన్-C లోపంతో బాధపడేవారికి ఉసిరి ఒక అద్భుతమైన ఔషధం. రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుతుంది.

గుండెకు రక్ష: రెగ్యులర్ గా ఉసిరిని తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొవ్వు (కొలెస్ట్రాల్) కరిగిపోతుంది. రక్తప్రసరణ మెరుగుపడి గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది.
మలబద్ధకానికి చెక్: ఇందులో ఉండే ఫైబర్ (పీచు పదార్థం) జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పేగుల కదలికలను సాఫీగా చేసి మలబద్ధకం సమస్య దరిచేరకుండా చూస్తుంది.

డయాబెటిస్ కంట్రోల్: మధుమేహం ఉన్నవారు ఉసిరిని డైట్ లో చేర్చుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. శరీర జీవక్రియ రేటు పెరిగి, బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది బాగా సహాయపడుతుంది.
ఎముకలు, రక్త వృద్ధి: ఉసిరి వల్ల రక్తంలో ఎర్ర రక్తకణాల సంఖ్య పెరుగుతుంది. అలాగే ఎముకలు బలంగా తయారవుతాయి. ముఖ్యంగా మహిళల్లో వచ్చే మోనోపాజ్ సమస్యలను తగ్గించడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది.

యవ్వనంగా కనిపించేలా: ఉసిరిలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం ముడతలు పడకుండా కాపాడతాయి. వృద్ధాప్య ఛాయలను తగ్గించి, ముఖం కాంతివంతంగా, యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.
ఎలా తినాలి?
ఉసిరికాయను రోజులో ఎప్పుడైనా తినవచ్చు, కానీ పరగడుపున తినడం వల్ల 100% ప్రయోజనాలు అందుతాయి. ఉసిరి దొరకని సీజన్ కోసం, ముక్కలుగా కోసి ఎండబెట్టుకుని నిల్వ చేసుకోవచ్చు.

గ్యాస్ ట్రబుల్ చిట్కా: గ్యాస్ సమస్యతో బాధపడేవారు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో.. ఒక గ్రాము ఉసిరి పొడి, కొద్దిగా పంచదార (లేదా పటిక బెల్లం) కలుపుకుని తాగితే తక్షణ ఉపశమనం లభిస్తుంది.
ఇవి కూడా చదవండి:
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

