Rice Water: బియ్యం కడిగిన నీళ్లను పారబోస్తున్నారా? ఈ మ్యాజిక్ తెలిస్తే మీ జుట్టు వద్దన్నా పెరుగుతుంది!
జుట్టు రాలిపోతోందని టెన్షన్ పడుతున్నారా? మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన షాంపూలు, నూనెలు వాడి విసిగిపోయారా?
అయితే మీకో శుభవార్త! మీ ఇంట్లోనే, వంటగదిలో దొరికే ఓ అద్భుతమైన ఔషధంతో మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా పెంచుకోవచ్చు. అదేంటో కాదు.. మనం రోజూ వృధాగా కింద పారబోసే ‘బియ్యం కడిగిన నీళ్లు’ (Rice Water).
చైనాలోని ‘యావో’ (Yao) తెగ మహిళల కురులు ఎంతో పొడవుగా, నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి. వారి అందమైన జుట్టు వెనక ఉన్న రహస్యం ఈ బియ్యం నీళ్లే! మరి ఈ బియ్యం నీళ్లతో మ్యాజిక్ ఎలా చేయాలో, దాన్ని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బియ్యం నీళ్లలో ఏముంటాయి?
బియ్యం కడిగిన నీళ్లలో అమైనో ఆమ్లాలు, విటమిన్ బి, విటమిన్ ఇ, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ‘ఇనోసిటాల్’ (Inositol) అనే కార్బోహైడ్రేట్ దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేసి, లోపలి నుండి బలాన్ని ఇస్తుంది.
జుట్టుకు కలిగే లాభాలు:
జుట్టు రాలడం తగ్గుతుంది: కుదుళ్లను బలపరిచి, హెయిర్ ఫాల్ కు చెక్ పెడుతుంది.
మెరుపు (Shine): జుట్టు సిల్కీగా, షైనీగా మారుతుంది.
చుండ్రు మాయం: తలమీద ఉండే ఇన్ఫెక్షన్లను, చుండ్రును తగ్గిస్తుంది.

వేగంగా పెరుగుదల: జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ మెరుగుపరిచి, జుట్టు వేగంగా పెరిగేలా చేస్తుంది.
రైస్ వాటర్ ఎలా తయారు చేయాలి?
దీన్ని తయారు చేయడానికి ప్రధానంగా రెండు పద్ధతులు ఉన్నాయి:
1. నానబెట్టే పద్ధతి (సాధారణ పద్ధతి):
అరకప్పు బియ్యాన్ని తీసుకుని ఒకసారి శుభ్రంగా కడగండి.ఆ తర్వాత అందులో రెండు కప్పుల నీళ్లు పోసి, 30 నిమిషాల నుంచి గంట పాటు అలానే ఉంచండి.ఇప్పుడు ఆ నీటిని వడకట్టి, ఒక స్ప్రే బాటిల్ లో కానీ, గిన్నెలో కానీ తీసుకోండి. అంతే రైస్ వాటర్ రెడీ!
2.పులియబెట్టిన పద్ధతి (Fermented Rice Water – బెస్ట్ రిజల్ట్స్ కోసం):
పైన చెప్పిన విధంగానే బియ్యం, నీళ్లు కలిపి ఒక గిన్నెలో ఉంచండి.ఈ గిన్నెపై మూతపెట్టి గది ఉష్ణోగ్రత వద్ద 12 నుంచి 24 గంటల పాటు కదపకుండా వదిలేయండి.

నీళ్లు కాస్త పుల్లటి వాసన రాగానే, వాటిని వడకట్టండి. (ఇలా పులియబెట్టడం వల్ల నీళ్లలోని పోషకాలు రెట్టింపు అవుతాయి).ఈ నీళ్లలో సగం సాధారణ నీటిని కలిపి (Dilute చేసి) వాడుకోవాలి.
పార్లర్‌కు వెళ్లే పనేలేదు.. మీ కిచెన్‌లో ఉండే ఈ 5 వస్తువులతో ‘గ్లోయింగ్ స్కిన్’ గ్యారెంటీ!!
ఎలా వాడాలి?
ముందుగా మీ రెగ్యులర్ షాంపూతో తలస్నానం చేయండి.జుట్టును శుభ్రంగా కడిగిన తర్వాత, తయారుచేసి పెట్టుకున్న రైస్ వాటర్‌ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించండి.
వేళ్లతో మాడుపై (Scalp) 5 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయండి.ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఆ నీళ్లను తలపోతనే ఉంచుకోండి.
చివరగా, ఎలాంటి షాంపూ వాడకుండా కేవలం సాధారణ నీటితో తలను శుభ్రంగా కడిగేయండి.

చిట్కా: ఈ పులియబెట్టిన నీళ్ల వాసన మీకు నచ్చకపోతే.. అందులో రెండు చుక్కల లావెండర్ (Lavender) లేదా రోజ్ మేరీ (Rosemary) ఎసెన్షియల్ ఆయిల్ కలుపుకోవచ్చు.
వారానికి రెండు సార్లు చొప్పున ఒక నెల రోజుల పాటు ఇలా చేసి చూడండి.. మీ జుట్టులో వచ్చే అద్భుతమైన మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు! ఇంకెందుకు ఆలస్యం, ఈరోజే బియ్యం కడిగిన నీళ్లను పారబోయకుండా మీ జుట్టుకు వాడి చూడండి.
గమనిక: అందరి చర్మం, జుట్టు ఒకేలా ఉండవు. మీకు ఏదైనా ఎలర్జీ సమస్యలు ఉంటే, దీన్ని వాడే ముందు చేతిపై ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

