Kitchen Tips:వంటగదిలో మీ శ్రమను సగానికి తగ్గించే అద్భుతమైన చిట్కాలు!
Kitchen Tips: ఈ వేసవిలో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో ఎక్కువ సేపు వంటగదిలో ఉండి పనులు చేయాలన్నా చాలా ఇబ్బంది. అందువల్ల ఇప్పుడు చెప్పే చిట్కాలను ఫాలో అయితే చాలా తొందరగా వంటను పూర్తీ చేయవచ్చు.
ఈ చిట్కాలను పాటిస్తే మీ సమయం, శ్రమ రెండూ ఆదా అవుతాయి. కబట్టి ఈ చిట్కాలను చదివి ఫాలో అవ్వండి.
ప్రతి ఒక్కరూ వంటింటిలో ఇప్పుడు చెప్పే చిట్కాలను ఫాలో అయితే వంట చాలా సులభంగా అవ్వటమే కాకుండా చాలా తక్కువ సమయంలో పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవచ్చు.
బియ్యం కడిగిన నీళ్లను పారబోస్తున్నారా? ఈ మ్యాజిక్ తెలిస్తే మీ జుట్టు వద్దన్నా పెరుగుతుంది!!
పనస పండు తొనలు తీసే ముందు చేతులకు నూనె రాసుకుంటే జిగురు అంటుకోదు. చేతులకు జిగురు అంటుకుంటే ఒక పట్టానా వదలదు.

రాగి గిన్నెల జిడ్డు వదలాలంటే నిమ్మ తొక్కలకు రాళ్ల ఉప్పు చేర్చి రుద్దితే తెల్లగా మెరిసిపోతాయి.
మరమరాలు కరకరలాడాలంటే గంట సేపు ఎండలో ఆరబెట్టి తీయాలి.
కూలర్లో కొంచెం రోజ్ వాటర్ కలిపితే గదంతా సువాసన వస్తుంది.
దొండ, చామదుంప, ఆలూ వంటి కూరలు రుచిగా వుండాలంటే వేగించిన జీలకర్ర పొడిని చేర్చితే చాలు

వేసవిలో కూరగాయలు త్వరగా వడలి పోకుండా వుండాలంటే తడి వస్త్రంలో చుట్టి అప్పుడప్పుడు నీళ్ళు చల్లుతుంటే వారం రోజుల పాటు తాజాగా ఉంటాయి.
గ్యాస్ స్టవ్ కొత్తదానిలా మెరవాలంటే నిమ్మకాయల డిప్పలను ఉడికించి …..ఆ నీటిలో స్పాంజిని ముంచి తుడవాలి.
పార్లర్కు వెళ్లే పనేలేదు.. మీ కిచెన్లో ఉండే ఈ 5 వస్తువులతో ‘గ్లోయింగ్ స్కిన్’ గ్యారెంటీ
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
Source: chaipakodi.com

