Healthhealth tips in telugu

150 కి పైగా రోగాలను తరిమికొట్టే అమృతం లాంటి ఆకు.. అస్సలు వదలకండి! |

Ranapala leaves health Benefits In telugu: మనం ప్రకృతి మనకిచ్చిన ఒక అద్భుతమైన వరం “రణపాల ఆకు” (Ranapala Leaf / Bryophyllum Pinnatum) గురించి తెలుసుకుందాం. దీనిని ‘మిరాకిల్ లీఫ్’ అని కూడా అంటారు.

చిన్న చిన్న ఆరోగ్య సమస్యల నుండి కిడ్నీలో రాళ్ల వరకు దాదాపు 150 కి పైగా రోగాలను నయం చేసే శక్తి ఈ ఒక్క ఆకుకు ఉంది. పూర్వీకుల కాలం నుండి ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. రణపాల ఆకు వల్ల కలిగే ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు, దీన్ని ఏయే రోగాలకు ఎలా ఉపయోగించాలో క్లియర్ గా తెలుసుకుందాం.

మన పరిసరాలలో ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. వాటిలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నా మనకు తెలియక వాటిని పిచ్చి మొక్కలుగా భావిస్తాము. అటువంటి మొక్కలలో రణపాల ఒకటి. రణపాల మొక్కను ఆఫీసుల వద్ద, ఇంటి పరిసరాలలో అలంకరణ మొక్కగా పెంచుతూ ఉంటారు.

ranapala leaves
రణపాల మొక్క ఆకులు వేర్లు కాండం ఇవన్నీ మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడి దాదాపు 150కి పైగా వ్యాదులను తగ్గించే శక్తి ఉంది. రణపాల ఆకు కాస్త దళసరిగా ఉండి రుచిలో పులుపు, వగరుతో కలిసి ఉంటుంది. ర‌ణ‌పాయ ఆకులు కిడ్నీల స‌మ‌స్య‌లు, కిడ్నీలో రాళ్ళు ఉన్న వారికి ఎంత‌గానో మేలు చేస్తాయి.
kidney problems
ఈ రణపాల ఆకు ఉదయం రెండు రాత్రి రెండు ఆకులు తింటే కిడ్నీలో,బ్లాడర్ లో ఎర్పడ్డ రాళ్ళను బయటకు పంపుతుంది. ర‌క్తంలోని క్రియాటిన్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. ఇది డ‌యాలసిస్ రోగుల‌కు మేలు చేస్తుంది. మూత్ర‌పిండాల ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. మూత్రాశయాన్ని శుభ్రం చేయడంతో పాటు ప్రేగుల నుండి హానికరమైన వ్యర్థాలను బయటకు పంపటానికి సహాయపడుతుంది.
Diabetes diet in telugu
అంతేకాకుండా శారీరక దృఢత్వాన్ని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచి డయబెటిస్ అదుపులో ఉండేలా చేస్తుంది. రణపాల ఆకులను మెత్తని పేస్ట్ గా చేసి నుదురు మీద రాస్తే తలనొప్పి తగ్గుతుంది. ర‌ణ‌పాల ఆకుల ర‌సం ఒక్క చుక్క‌ను చెవిలో వేస్తే చెవిపోటు త‌గ్గుతుంది.

gas troble home remedies
జీర్ణాశ‌యంలోని అల్సర్లు త‌గ్గుతాయి. అజీర్ణం, మ‌ల‌బ‌ద్దకం స‌మ‌స్యల‌ను తగ్గిస్తుంది. ఈ ఆకుల్లో యాంటీ పైరెటిక్ ల‌క్షణాలు ఉండుట వలన మ‌లేరియా, టైఫాయిడ్ జ్వరాలు వారికీ మంచి మేలు చేస్తుంది. కాబట్టి ఈ మొక్క కనిపిస్తే ఇంటికి తెచ్చుకోండి. ఈ మొక్క చాలా సులభంగా పెంచుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."