రక్తహీనత, విపరీతమైన నీరసంతో ఇబ్బంది పడుతున్నారా? ఉదయాన్నే ఈ ఒక్క స్పూన్ తింటే చాలు!
ఎండుద్రాక్ష (Raisins), తేనె (Honey).. ఈ రెండింటిలోనూ విడివిడిగా బోలెడన్ని పోషకాలు ఉన్నాయనే విషయం మనకు తెలిసిందే. అయితే, వీటిని విడివిడిగా కాకుండా కలిపి తీసుకుంటే వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి.
ముఖ్యంగా కొన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారికి ఈ కాంబినేషన్ ఒక సంజీవనిలా పనిచేస్తుంది.ఈ సూపర్ కాంబినేషన్ వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు మరియు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

తేనె-ఎండుద్రాక్ష మిశ్రమం ఎలా తయారు చేయాలి?
ఒక శుభ్రమైన గాజు సీసాలో గుప్పెడు ఎండుద్రాక్షలను వేయాలి.
అవి పూర్తిగా మునిగే అంతవరకు స్వచ్ఛమైన తేనెను పోసి మూత పెట్టాలి.
ఈ సీసాను రెండు రోజుల పాటు కదపకుండా పక్కన పెట్టేయాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమం తయారవుతుంది. దీనిని ఫ్రిజ్‌లో పెడితే 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది.
ఎలా తీసుకోవాలి?
నియమం: ప్రతిరోజూ ఉదయం పరగడుపున (ఖాళీ కడుపుతో) ఒక స్పూన్ మోతాదులో ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. ఇది తీసుకున్న తర్వాత, అంతకుముందు అరగంట వరకు ఏమీ తినకూడదు, తాగకూడదు.

ఈ మిశ్రమంతో చెక్ పెట్టే ప్రధాన సమస్యలు:
1. రక్తహీనత (Anemia) మాయం
ప్రస్తుత కాలంలో చాలామందిని వేధించే సమస్య రక్తహీనత. తేనె, ఎండుద్రాక్షల కాంబినేషన్ శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది రక్తంలో హీమోగ్లోబిన్ శాతాన్ని వేగంగా పెంచి రక్తహీనత సమస్యను పూర్తిగా తగ్గిస్తుంది.
2. ఎముకల బలహీనతకు చెక్ (బోరాన్ మహిమ)
ఎముకల ఆరోగ్యానికి పాలలో ఉండే కాల్షియం ఎంత అవసరమో.. ఎండుద్రాక్షలో ఉండే ‘బోరాన్’ (Boron) అనే ప్రత్యేక కాల్షియం కూడా అంతే ముఖ్యం. ఇది తేనెతో కలిసినప్పుడు ఎముకలను, కండరాలను ఉక్కులా బలోపేతం చేస్తుంది. కీళ్ల నొప్పుల సమస్య దరిచేరదు.
3. ఇన్‌స్టంట్ ఎనర్జీ బూస్టర్
రోజంతా ఆఫీస్ పనుల వల్ల వచ్చే అలసట, నీరసం, నిస్సత్తువలను ఇది క్షణాల్లో దూరం చేస్తుంది. ఇదొక సహజసిద్ధమైన ఎనర్జీ బూస్టర్‌లా పనిచేసి రోజంతా మిమ్మల్ని హుషారుగా ఉంచుతుంది.

4. గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది
ఈ మిశ్రమాన్ని రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) నియంత్రణలోకి వస్తుంది. ఇందులో ఉండే సమృద్ధియైన పొటాషియం అధిక రక్తపోటును (High BP) అదుపులో ఉంచి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
5. జీర్ణక్రియ మెరుగుపడుతుంది
దీనిలోని ఫైబర్ గుణాలు మలబద్ధకం (Constipation) సమస్యను వేగంగా తగ్గిస్తాయి. జీర్ణశక్తిని పెంచి, తిన్న ఆహారం బాగా అబ్బేలా చేస్తాయి.
చివరగా: శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, ఎటువంటి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడటంలో ఈ హోమ్ రెమెడీ అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా శీతాకాలంలో, వాతావరణం మారినప్పుడు వచ్చే శరీర బలహీనతను అధిగమించడానికి దీన్ని తప్పకుండా ట్రై చేయండి!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

