Healthhealth tips in teluguKitchenvantalu

సజ్జ అప్పాలు: మహిళల్లో కీళ్ల నొప్పులు, రక్తహీనతను మాయం చేసే అద్భుతమైన హెల్తీ స్నాక్!

sajja appalu Health benefits in Telugu : మహిళల్లో ఈ రోజుల్లో ఎక్కువగా కనిపిస్తున్న సమస్యలు కీళ్ల నొప్పులు, నడుము నొప్పి మరియు రక్తహీనత (Anemia). వీటన్నింటికీ మన పెద్దలు చెప్పిన ఒకే ఒక్క సూపర్ ఫుడ్ “సజ్జ అప్పాలు”.

సజ్జల్లో ఉండే ఐరన్, కాల్షియం, ఫైబర్ శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. ఎముకలను ఉక్కులా మారుస్తాయి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే ఈ సాంప్రదాయ సజ్జ అప్పాలను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు.

సజ్జల్లో క్యాల్షియం మరియు ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ. ఇవి శరీరంలో రక్తాన్ని పెంచడమే కాకుండా, కీళ్ల అరుగుదలను నివారించి ఎముకలను బలంగా ఉంచుతాయి.

ఈ మధ్య కాలంలో అన్నీ వయస్సుల వారు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఎముకలకు సంబందించిన సమస్యలు మరియు రక్తహీనత వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాంటి వారు ఈ అప్పాలను తింటే చాలా మంచి ప్రయోజనం కనపడుతుంది. వీటిని సజ్జ బూరెలు అని కూడా పిలుస్తారు.
sajjalu health benefits
ఒక గిన్నెలో ఒక కప్పు సజ్జలను తీసుకొని శుభ్రంగా కడిగి నీటిని పోసి రాత్రంతా నానబెట్టాలి. నానిన సజ్జలలో నీటిని తీసేసి ఒక క్లాత్ మీద అరగంట పాటు ఆరబెట్టాలి. ఆరిన సజ్జలను మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని జల్లెడ సాయంతో జల్లించాలి. పొయ్యి మీద పాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేయాలి.

నెయ్యి కరిగాక రెండు స్పూన్ల గసగసాలు వేసి ఒక సారి కలిపి అరకప్పు పచ్చి కొబ్బరి వేసి పచ్చి వాసన పోయే వరకు వేగించాలి. ఆ తర్వాత పాన్ లో అరకప్పు బెల్లం, చిటికెడు ఉప్పు వేసి మూడు స్పూన్ల నీటిని వేసి బెల్లం కరిగాక పొయ్యి ఆఫ్ చేయాలి. పాకం రావలసిన అవసరం లేదు. బెల్లం నీటిని వడకట్టి పక్కన పెట్టాలి.

ఒక బౌల్ లో సజ్జ పిండి, వెగించిన గసగసాలు,కొబ్బరి మిశ్రమం, అరస్పూన్ యాలకుల పొడి వేయాలి. ఆ తర్వాత బెల్లం నీటిని పోసి పిండిని ముద్దలా కలపాలి. ఈ పిండిని కొంచెం తీసుకొని ముద్దలా చేసుకొని అప్పంలా వత్తి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి దాదాపుగా 15 రోజుల పాటు నిల్వ ఉంటాయి.
jaggery Health benefits in telugu
వీటిని వారంలో 2 సార్లు తింటే రక్తహీనత మరియు ఎముకలకు సంబందించిన సమస్యలు అయిన కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు వంటివి తగ్గుతాయి. ముఖ్యంగా మహిళలు వీటిని తింటే మంచి ప్రయోజనాలను పొందవచ్చు. సజ్జ అప్పాలు చాలా రుచిగా ఉంటాయి. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఆర్గానిక్ బెల్లం వాడితే మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."