MoviesTollywood news in telugu

బుల్లితెరపై తమిళ హీరోల దండయాత్ర.. తెలుగు సీరియల్స్‌లో రోజువారి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

తెలుగు సీరియల్స్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పటిలా సాగదీసే ఏడుపుగొట్టు కథలు కాదు.. సినిమాలను మించే ట్విస్టులు, అదిరిపోయే గ్రాఫిక్స్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి.

అందుకే ఇప్పుడు మహిళలతో పాటు పురుషులు కూడా సీరియల్స్‌కు అతుక్కుపోతున్నారు. అయితే ఈ మధ్య తెలుగు బుల్లితెరపై ఒక ఆసక్తికరమైన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగు సీరియల్స్‌లో మన హీరోల కంటే తమిళ హీరోల డామినేషన్ ఎక్కువగా పెరిగిపోయింది.

ఇది తెలుగు సీరియలా? లేక డబ్బింగ్ సీరియలా? అని ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యే స్థాయిలో కోలీవుడ్ నటులు ఇక్కడ పాతుకుపోయారు. మరి మన తెలుగు ఆడియన్స్‌ను అలరిస్తున్న ఆ తమిళ హీరోలు ఎవరు? వారు ఒక్కో రోజుకు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంత? అన్న ఆసక్తికర వివరాలు మీకోసం..

విష్ణుకాంత్ (బాలు) – గుండె నిండా గుడి గంటలు
స్టార్ మా లో ప్రసారమవుతూ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సీరియల్ ‘గుండె నిండా గుడి గంటలు’. ఇందులో బాలు పాత్రలో అదరగొడుతున్న హీరో విష్ణుకాంత్ అసలు ఓ తమిళ నటుడు.

అక్కడ ఎన్నో సీరియల్స్ లో నటించిన ఈయనకు తెలుగులో ఇదే మొదటి ప్రాజెక్ట్. తనదైన నటనతో క్రేజ్ తెచ్చుకున్న విష్ణుకాంత్.. ఒక్కో రోజు కాల్ షీట్‌కు ఏకంగా రూ. 40 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

చక్రి – పొదరిల్లు
స్టార్ మా లోనే టాప్ రేటింగ్స్‌తో దూసుకుపోతున్న మరో సీరియల్ ‘పొదరిల్లు’. గతేడాది డిసెంబర్ లో ప్రారంభమైన ఈ సీరియల్ టాప్ సీరియల్స్‌కు గట్టి పోటీ ఇస్తోంది.

ఇందులో హీరోగా నటిస్తున్న చక్రి కూడా కోలీవుడ్ నుంచే వచ్చాడు. తెలుగులో ఇదే తొలి సీరియల్ అయినా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇతని రోజువారి పారితోషికం సుమారు రూ. 30 వేల పైనే ఉంటుందని బుల్లితెర వర్గాల టాక్.
godavari serial 1
జై ధనుష్ – నెం.1 కోడలు
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు జై ధనుష్. ‘కలవారి కోడలు’, ‘నెం.1 కోడలు’ లాంటి పాపులర్ సీరియల్స్‌తో ఇక్కడ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు.

పరభాషా నటుడే అయినా.. అచ్చమైన తెలుగింటి కుర్రాడిలా మహిళా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇతను కూడా రోజువారీ భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ తీసుకుంటారని తెలుస్తోంది.

మారన్ చంద్రశేఖర్ (సూర్య) – గోదావరి
స్టార్ మాలో సరికొత్తగా వస్తున్న ‘గోదావరి’ సీరియల్ లో సూర్య పాత్రలో నటిస్తున్నది కూడా తమిళ హీరోనే. అతని అసలు పేరు మారన్ చంద్రశేఖర్.

తన ఎక్స్‌ప్రెషన్స్ తో, అద్భుతమైన నటనతో తక్కువ కాలంలోనే ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాడు. ఇలాగే కంటిన్యూ అయితే ఇతను త్వరలోనే టాప్ హీరోల లిస్ట్‌లో చేరడం ఖాయం అంటున్నారు ప్రేక్షకులు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."