Healthhealth tips in telugu

రోజుకు అర స్పూన్ ఈ పొడి పాలల్లో కలుపుకుంటే.. మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు జీవితంలో రావు!

ఒకప్పుడు మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అంటే కేవలం 60 ఏళ్లు పైబడిన పెద్దవాళ్లలోనే చూసేవాళ్లం. కానీ, ఇప్పుడలా కాదు.. మారిన మన లైఫ్ స్టైల్, బరువు పెరగడం, అస్సలు ఎక్సర్‌సైజ్ చేయకపోవడం వల్ల 30 ఏళ్లు దాటకముందే చాలామంది నొప్పులతో నరకం చూస్తున్నారు. కూర్చోవాలన్నా, లేవాలన్నా మోకాళ్లు కటకటలాడుతున్నాయి.

అయితే, వీటన్నింటికీ మన వంటిట్లోనే ఒక సూపర్ రెమెడీ ఉంది. కేవలం ఒక చిన్న చిట్కాతో మీ నొప్పులన్నీ మాయం చేసుకోవచ్చు. ఇంతకీ ఆ చిట్కా ఏంటో, దాన్ని ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు సింపుల్‌గా చూసేద్దాం!
kabuli chana
ఆ అద్భుతమైన గింజలు ఏంటంటే..
మోకాళ్ళ నొప్పులను తగ్గించడంలో కాబూలీ శనగలు (White Chickpeas) చాలా బాగా పనిచేస్తాయి. ఒకప్పుడు ఇవి దొరకడం కష్టంగా ఉండేది కానీ, ఇప్పుడు ప్రతి కిరాణా కొట్టులోనూ ఇవి ఈజీగా దొరుకుతున్నాయి.

పొడి ఎలా తయారు చేసుకోవాలి?:
ముందుగా కొన్ని కాబూలీ శనగలను తీసుకుని స్టవ్ మీద బాగా వేగించుకోవాలి. అవి కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని ఒక డబ్బాలో పోసి మూత గట్టిగా పెడితే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది.
Chickpeas health benefits in telugu
ఎలా తీసుకోవాలో తెలుసా?:
రోజూ ఉదయం పూట ఒక గ్లాసు గోరువెచ్చని ఆవు పాలు తీసుకోండి. అందులో మనం తయారుచేసి పెట్టుకున్న కాబూలీ శనగల పొడిని అర స్పూన్ వేయండి. ఆ తర్వాత ఒక స్పూన్ తేనె కూడా వేసి బాగా కలిపేసి తాగేయండి.

ఉదయాన్నే ఈ పాలు తాగితే కలిగే లాభాలు:
ఎముకలకు వజ్రాలంత బలం: ఈ పాలు తాగడం వల్ల ఎముకల బలహీనత తగ్గుతుంది. వయసు పెరిగే కొద్దీ ఎముకలు పెళుసుగా మారకుండా ఉంటాయి. దాంతో మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పుల నుంచి శాశ్వతంగా ఉపశమనం లభిస్తుంది.

మలబద్ధకం సమస్యకు చెక్: మీకు జీర్ణసంబంధమైన సమస్యలు ఉన్నా, లేదా మోషన్ ఫ్రీగా అవ్వక ఇబ్బంది పడుతున్నా (మలబద్ధకం) ఈ పాలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి.

గుండెకు ఎంతో మంచిది: రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి, మీ గుండెను చాలా హెల్తీగా ఉంచుతుంది.

పిల్లల్లో ప్రోటీన్ లోపం ఉండదు: ఈ రోజుల్లో పెద్దవాళ్లలోనే కాదు, చిన్నపిల్లల్లో కూడా ప్రోటీన్ లోపం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. పిల్లలకు ఉదయాన్నే ఈ పాలు ఇవ్వడం వల్ల శరీరానికి కావలసిన ప్రోటీన్ సమృద్ధిగా అందుతుంది.

రోజంతా ఫుల్ ఎనర్జీ: దీనివల్ల అలసట, నీరసం అనేవి అస్సలు ఉండవు. రోజంతా చాలా హుషారుగా, యాక్టివ్‌గా ఉంటారు.

చిన్న మాట: చూశారుగా! మార్కెట్లో దొరికే పెయిన్ కిల్లర్స్ వాడే కంటే, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ నేచురల్ హోమ్ రెమెడీని ట్రై చేసి చూడండి. నొప్పులకు గుడ్ బై చెప్పండి!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."