Cracked Heels: కేవలం 3 రోజుల్లో పాదాల పగుళ్లు మాయం.. ఇంట్లోనే ఉండే ఈ వస్తువులతో మ్యాజిక్ చూడండి!
మారుతున్న వాతావరణం, కాలుష్యం కారణంగా పాదాల పగుళ్ల సమస్య (Cracked Heels) ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తోంది. పగుళ్లు ఎక్కువగా ఉన్నప్పుడు చూడటానికి అసహ్యంగా ఉండటమే కాకుండా.. వాటి మధ్య దుమ్ము, ధూళి పేరుకుపోయి నొప్పి, మంట పుడతాయి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే మరింత తీవ్రమవుతుంది.
మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీమ్స్ వాడి విసిగిపోయారా? అయితే అసలు కంగారు పడకండి. మన వంటగదిలో దొరికే సహజ సిద్ధమైన వస్తువులతోనే ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు.

కావాల్సినవి
కొబ్బరి నూనె (Coconut Oil) లేదా
ఆముదం (Castor Oil) లేదా
పాల మీగడ (Milk Cream)
ఎలా వాడాలి?:
మసాజ్ చేయండి: రాత్రి పడుకునే ముందు పైన చెప్పిన మూడింటిలో మీకు అందుబాటులో ఉన్న ఏదైనా ఒక దాన్ని తీసుకోండి. పాదాల పగుళ్లు ఉన్న చోట రాసి, సుమారు 5 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయండి.
వేడి నీటిలో నానబెట్టండి: ఆ తర్వాత ఒక బకెట్ లో లేదా టబ్ లో గోరువెచ్చని నీళ్లు తీసుకోండి. అందులో మీ పాదాలను కనీసం 20 నిమిషాల పాటు ఉంచండి.

శుభ్రం చేయండి: పాదాలు మెత్తబడిన తర్వాత, ఒక సాఫ్ట్ బ్రష్ లేదా ప్యూమిస్ స్టోన్ (కాళ్లు రుద్దుకునే రాయి) తీసుకుని డెడ్ స్కిన్ పోయేలా మృదువుగా రుద్దండి.
తేమను అందించండి: శుభ్రం చేసిన తర్వాత కాళ్లను పొడి టవల్ తో తుడిచి, కొద్దిగా మాయిశ్చరైజర్ లేదా కొబ్బరి నూనె రాసి సాక్స్ వేసుకుని పడుకోండి.
Also Read: Hair Growth Tips: తెల్లజుట్టు, హెయిర్ ఫాల్ కి శాశ్వతంగా చెక్.. ఇంట్లోనే ఈ ‘మ్యాజికల్ ఆయిల్’
ముఖ్య గమనిక: ఈ చిట్కాను క్రమం తప్పకుండా పాటిస్తే కేవలం 3 రోజుల్లోనే మీకు మార్పు కనిపిస్తుంది. పగుళ్లు పూర్తిగా తగ్గిపోయి పాదాలు గులాబీ రేకుల్లా మృదువుగా మారాలంటే.. కాస్త ఓపికగా కనీసం 10 రోజుల పాటు ఈ ప్రాసెస్ ని కంటిన్యూ చేయండి.
ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజే ఈ సింపుల్ చిట్కాను ట్రై చేసి మీ పాదాలను అందంగా మార్చుకోండి!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

