Healthhealth tips in telugu

చెత్త అనుకునే ఉల్లిపాయ పొట్టుతో ఇన్ని లాభాలా? తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

Onion Peel benefits In Telugu : మనం రోజూ వంటల్లో ఉల్లిపాయలు వాడిన తర్వాత దాని పొట్టును (Onion Peels) పనికిరాని చెత్తగా భావించి పారేస్తుంటాం. కానీ, ఆ ఉల్లిపాయ తొక్కల్లో దాగున్న ప్రయోజనాలు తెలిస్తే మీరు జీవితంలో వాటిని పారేయరు!

ఈ ప్రయోజనాల గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. దీనిలో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు బ్యూటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

ఉల్లిపాయను మనం ప్రతి రోజు వంటల్లో ఉపయోగిస్తాం. వేసవిలో వేడి తగ్గటానికి ఉల్లిపాయను పెరుగు, మ‌జ్జిగ వంటి వాటిల్లో వేసుకొని తీసుకుంటూ ఉంటాం. ఉల్లిపాయలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఉల్లిపాయలోనే కాకుండా మనం తీసి పడేసే ఉల్లిపాయ పొట్టు వలన కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
How to cut onions without crying In Telugu
కానీ ఆ తొక్కల్లో కూడా కొన్ని రకాల ఉపయోగాలుంటాయన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ ప్రయోజనాల గురించి తెలిస్తే మీరు కూడా ఉల్లిపాయ పొట్టును పాడేయరు. ఇప్పుడు ఉల్లిపాయ పొట్టులో ఉన్న లాభాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఉల్లిపాయ పొట్టుతో సూప్ చేసుకుని తాగుతుంటే శరీరంలో చెడు కొలస్ట్రాల్ తొలగిపోయి మంచి కొలస్ట్రాల్ పెరుగుతుంది.
Weight Loss Tips in telugu

దాంతో శరీర బరువు తగ్గటమే కాకుండా గుండె సమస్యలు కూడా రావు. అంతేకాక యాంటీ బ‌యోటిక్‌, యాంటీ ఫంగ‌ల్ ఏజెంట్‌గా పనిచేసి శరీరంలో ఇన్ ఫెక్షన్స్ రాకుండా చూస్తుంది. ఉల్లిపొట్టు సూప్ లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. క్వ‌ర్సెటిన్ అని పిల‌వ‌బ‌డే ఓ ర‌క‌మైన యాంటీ ఆక్సిడెంట్ ఉండుట వలన పలు ర‌కాల క్యాన్స‌ర్లు రాకుండా మరియు క్యాన్స‌ర్ క‌ణ‌తుల వృద్ధిని త‌గ్గించే గుణం ఉంది.

ఉల్లిపాయ పొట్టును రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఆ నీటిని నొప్పులు, వాపులు ఉన్న ప్రదేశంలో రాస్తే మంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఏమైనా చర్మ సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. ఒక గిన్నెలో నీటిని తీసుకోని దానిలో ఉల్లిపాయ పొట్టును వేసి, ఆ గిన్నెను కిటికీలు లేదా గుమ్మం వ‌ద్ద పెడితే ఇంట్లోకి దోమ‌లు, ఈగ‌లు రావు.
Hair Fall Tips In Telugu
ఉల్లిపాయ పొట్టు నుంచి వచ్చే వాస‌న వాటికి న‌చ్చ‌దు. అందుకే అవి ఇంట్లోకి రాకుండా ఉంటాయి. తలస్నానము చేయటానికి ముందు తల మీద ఉల్లిపాయ పొట్టుతో బాగా మ‌ర్ద‌నా చేయాలి. ఇలా చేయటం వలన వెంట్రుక‌లు రాల‌డం త‌గ్గుతుంది. జుట్టు దృఢంగా పెరుగుతుంది. చుండ్రు వంటి  ఇత‌ర స‌మ‌స్య‌లు కూడా  పోతాయి. అంతేకాక ఉల్లిలోని సల్ఫర్… పాడైన, సన్నబడిన వెంట్రుకల్ని బలంగా చేస్తుంది. తెల్ల జుట్టును గోధుమ, బంగారం రంగులోకి మార్చుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."