Healthhealth tips in telugu

వాల్‌నట్స్ ఎలా పడితే అలా తింటున్నారా? రోజుకు ఎన్ని తినాలో తెలిస్తే షాక్ అవుతారు!

WalNuts Benefits In telugu : ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది డ్రై fruits ఎక్కువగా తింటున్నారు. వాటిలో ఉన్న ప్రయోజనాల దృష్ట్యా మరియు మారిన పరిస్థితి కారణంగా dri fruits తినటం అలవాటు చేసుకున్నారు.

వాల్‌న‌ట్స్‌… చూసేందుకు ఇవి చిన్న‌పాటి మెద‌డు ఆకారంలో ఉంటాయి. కానీ ఇవి మ‌న శ‌రీరానికి అందించే ప్ర‌యోజ‌నాలు మాత్రం పుష్క‌లం. వాల్ నట్ శాస్త్రీయ నామము ” జుగ్లాన్స్ రెజియా . అయితే ఈ వాల్ నట్ తినడానికి చాలా మంది ఇష్టపడరు. ఎందుకంటే వాల్ నట్స్ బిట్టర్ టెస్ట్ కలిగి ఉంటాయి.

వాల్ నట్స్ (Walnuts) మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ వాటిని సరైన పద్ధతిలో తినకపోతే ఆశించిన ఫలితాలు రావు సరే కదా, కొన్ని నష్టాలు కూడా జరిగే అవకాశం ఉంది. చాలామంది వాల్ నట్స్‌ను నేరుగా తింటుంటారు, కానీ వాటిని నానబెట్టి తినడం వల్ల కలిగే లాభాలు రెట్టింపు అవుతాయి.
walnut benefits in telugu
ఇప్పుడు చెప్పే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే తప్పకుండ వాల్ నట్స్ తినటం అలవాటు చేసుకుంటారు. వాల్ నట్స్ మెదడు ,మెమొరీకి మంచిదని అందరూ భావిస్తారు. అయితే వాల్ నట్స్ ని సరైన విధంగా తీసుకుంటే మెదడు ఆరోగ్యానికే కాకుండా ఎన్నో ప్రయోజనాలు మన శరీరానికి ఇస్తుంది. చాలా మందికి రోజుకి ఎన్ని వాల్ నట్స్ తినాలో అనే సందేహం ఉంటుంది.రోజుకి 3 వాల్ నట్స్ తింటే సరిపోతుంది.

అలాగే చాలా మందిలో మరొక సందేహం కూడా ఉంది. అది ఏమిటంటే వాల్ నట్స్ నానబెట్టి తినాలా లేక మాములుగా తినాలా? నానబెట్టి తింటేనే మంచిది. వాల్ నట్స్ తీసుకుని ఒక గిన్నెలో నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం తొక్క తీసి తినాలి. లేదంటే.. ఈ తొక్క ద్వారా మన శరీరానికి ఎక్కువ హాని కలుగుతుంది. వాల్ నట్స్ ని నానబెట్టి తినడం వల్ల చాలా తేలికగా జీర్ణమవుతాయి.
Top 10 iron rich foods iron deficiency In Telugu
వాల్ నట్స్ లో కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్, మంచి ఫ్యాట్, ఫైబర్, విటమిన్స్, క్యాల్షియం, ఐరన్, పొటాషియం, సోడియం సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు శరీరానికి ఎంతో మేలును కలిగిస్తాయి. వాల్ నట్స్ ని నానబెట్టి తినటం వలన రక్తంలో చెడు కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే అదే సమయంలో మంచి కొలస్ట్రాల్ ని పెరిగేలా ప్రోత్సహిస్తుంది. దాంతో గుండె వ్యాధుల ప్రమాదాలు తగ్గుతాయి.
Diabetes In Telugu

మధుమేహం ఉన్నవారు రోజుకి 3 వాల్ నట్స్ తినవచ్చు. రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా  ఉండటం వల్ల.. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. శరీరంలో క్యాన్సర్ కి కారణమయ్యే కణాలను పూర్తీగా నాశనం చేస్తాయి.వాల్ నట్స్ లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండుట వలన ఒత్తిడి,డిప్రెషన్ వంటి వాటిని తగ్గిస్తుంది. కాస్త ఒత్తిడిగా ఉన్నప్పుడు వాల్ నట్స్ తింటే ఒత్తిడి తగ్గుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."