Healthhealth tips in telugu

15 రోజుల్లో నడుము, బొడ్డు చుట్టూ కొవ్వు మంచులా కరగడం గ్యారెంటీ! Chia Seeds & Pineapple Weight Loss Drink!

Weight Loss Drink : చాలా మందిని వేధించే ప్రధాన సమస్య.. బొడ్డు మరియు నడుము చుట్టూ పేరుకుపోయే మొండి కొవ్వు (Belly Fat). ఎన్ని డైట్లు చేసినా, వ్యాయామాలు చేసినా ఈ కొవ్వు అంత త్వరగా కరగదు.

కానీ, ఈ విధంగా చియా సీడ్స్ (Chia Seeds) మరియు పైనాపిల్ (Pineapple) కాంబినేషన్‌తో ఒక స్పెషల్ డ్రింక్ తయారు చేసుకుని తాగితే.. కేవలం 15 రోజుల్లోనే మీ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు మంచులా కరిగిపోతుంది!

అధిక బరువు,శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించుకోవటానికి ఒక డ్రింక్ తెలుసుకుందాం. ఈ డ్రింక్ తాగితే అధిక బరువు,శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటమే కాకుండా శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. ఈ డ్రింక్ కోసం కేవలం రెండు ఇంగ్రిడియన్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాం.

చియా సీడ్స్: వీటిలో ఫైబర్ మరియు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆకలిని నియంత్రించి, మెటబాలిజాన్ని పెంచుతాయి.

పైనాపిల్: ఇందులో ఉండే ‘బ్రోమెలైన్’ (Bromelain) అనే ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుపరిచి, పొట్ట భాగంలో ఉన్న కొవ్వును వేగంగా కరిగిస్తుంది.

chia seeds
చియా సీడ్స్ లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సమృద్దిగా ఉండుట వలన శరీరంలో మంటను తగ్గించటం,కొలెస్ట్రాల్ ని తగ్గించటం,ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు.
pineapple benefits
ఒక స్పూన్ చియా సీడ్స్ ని ఒక గ్లాస్ నీటిలో వేసి మూడు గంటల పాటు నానబెట్టాలి. ఇక రెండోది ఫైనాఫిల్. ఫైనాఫిల్ లో ఉండే బ్రోమెలైన్ అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్న ఎంజైమ్‌ల మిశ్రమం, ఇది జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ఫైబర్ కడుపు నిండిన భావన కలిగిస్తుంది. మాంగనీస్‌ అనేది కొవ్వు జీవక్రియలను పెంచుతుంది.
Weight Loss tips in telugu

ఒక కప్పు ఫైనాఫిల్ ముక్కలను, నానబెట్టిన చియా సీడ్స్ ని ఒక మిక్సీ జార్ లో వేసి కప్పు నీటిని పోసి మిక్సీ చేయాలి. ఈ డ్రింక్ ని ఫ్రిజ్ లో మూడు రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. ఈ డ్రింక్ ని ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయటానికి గంట ముందు తీసుకోవాలి. ఇలా తీసుకుంటే క్రమంగా శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."