Healthhealth tips in telugu

డయాబెటిస్, రక్తహీనతలకు చెక్ పెట్టే మ్యాజిక్ పొడి.. రోజుకు 1 స్పూన్ తింటే చాలు!

jack fruit powder: కేవలం 1 స్పూన్ పొడితో డయాబెటిస్, రక్తహీనత సమస్యలకు చెక్ పెట్టవచ్చా? పనసకాయ పొడిని రోజూ డైట్‌లో చేర్చుకోవడం వల్ల బ్లడ్ షుగర్ ఎలా కంట్రోల్ అవుతుంది, రక్తం ఎలా పెరుగుతుందో ఈ రోజే తెలుసుకోండి!

డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందంటే దాన్ని తగ్గించుకోవటం చాలా కష్టం. అలాగే జీవితకాలం మందులు వాడాల్సిందే. డయాబెటిస్ రాకముందు జీవనవిధానం ఒకలా ఉంటే డయాబెటిస్ వచ్చాక జీవన విధానం మరోలా ఉంటుంది. ఎందుకంటే ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

డయాబెటిస్ వచ్చినప్పుడు కంగారు పడకుండా మందులు వాడుతూ ఇప్పుడు చెప్పే పొడిని తీసుకుంటే డయాబెటిస్ అనేది నియంత్రణలో ఉంటుంది. పనస కాయ పొడి డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచటంలో చాలా బాగా సహాయపడుతుంది. గ్లైసెమిక్ ను నియంత్రించి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచుతుంది. ఇన్సులిన్ యాక్టివ్ గా పని చేసేటట్టు చేస్తుంది. రక్తంలోకి చక్కెర వెళ్ళకుండా కంట్రోల్ చేస్తుంది.
Diabetes diet in telugu

పనసకాయ పొడి మార్కెట్ లో లభ్యం అవుతుంది. ఇంటిలో కూడా తయారుచేసుకోవచ్చు. పచ్చి పనస కాయని ముక్కలుగా కట్ చేసి బాగా ఎండపెట్టాలి.ముక్కులు బాగా ఎండిన తర్వాత పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని ఒక స్పూన్ ప్రతి రోజు తీసుకోవాలి. ఈ పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తాగవచ్చు. లేదా అట్లు లేదా చపాతీ వంటి వాటిలో కలిపి తినవచ్చు.
Weight Loss tips in telugu

ఈ పొడిని కూరల్లో వేసుకొని కూడా తినొచ్చు. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి అధిక బరువు, శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగిస్తుంది. పనస పొడిలో ఐరన్ సమృద్దిగా ఉండటం వల్ల.. రక్త హీనత సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఈ పొడిలో విటమిన్ సి ఎక్కువగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పొటాషియం సమృద్దిగా ఉండుట వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."