Healthhealth tips in telugu

పాదాల్లో ఆనెలు వేధిస్తున్నాయా? ఈ సింపుల్ చిట్కాతో ఒక్క రోజులోనే చెక్ పెట్టండి!

Foot Corn Home Remedies in Telugu : మనలో చాలా మందిని పాదాలపై ఆనెలు వేధిస్తూ ఉంటాయి. మృతకణాలు పేరుకుపోవటం, బ్యాక్టీరియా, అధిక రాపిడి వంటి కారణాల వల్ల పాదాలపై ఆనెలు వస్తూ ఉంటాయి.

ఆనెలు వచ్చినప్పుడు బాధను కలిగించడమే కాకుండా నడిచే సమయంలో చాలా అసౌకర్యం కలిగిస్తాయి. కొద్దిగా దూరం నడిచినా కూడా నొప్పి వస్తుంది.
Garlic side effects in telugu
అందుకే వీటిని తగ్గించుకోవడానికి రకరకాల అయింట్ మెంట్స్, క్రీమ్స్ వాడుతుంటారు. వీటిని తగ్గించుకోవడానికి ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయ పడుతాయి.

అనెలను తగ్గించుకోవటానికి వెల్లుల్లి చాలా బాగా సహాయపడుతుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీసెప్టిక్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ లక్షణాలు అనెలను తగ్గించడానికి సహాయపడుతాయి.

వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని. అనెలు ఉన్న ప్రదేశంలో కట్టు కట్టాలి.ఈ విధంగా ప్రతి రోజూ చేస్తూ ఉంటే త్వరగా తగ్గిపోతాయి.

బకెట్ లో గోరువెచ్చని నీటిని పోసి ఉల్లిపాయ రసం వేసి అందులో పాదాలను ఉంచాలి ఈ విధంగా రోజు చేస్తూ ఉంటే తగ్గుముఖం పడతాయి.

సమస్య చిన్నగా ఉన్నప్పుడూ ఈ ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. అదే సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇటువంటి ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ప్రయోజనం కనపడుతుంది. కాస్త ఓపికగా,శ్రద్దగా చేసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."